పంచాయతీల్లో డ్రైడే తప్పక పాటించాలి : డీపీఓ

ABN , First Publish Date - 2021-08-27T05:48:39+05:30 IST

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ప్రతి శుక్రవారం తప్పని సరిగా డ్రైడే పాటించాలని డీపీఓ శివారెడ్డి సూ చించారు.

పంచాయతీల్లో డ్రైడే తప్పక పాటించాలి : డీపీఓ

అనంతపురం రైల్వే, ఆగస్టు26: జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ప్రతి శుక్రవారం తప్పని సరిగా డ్రైడే పాటించాలని డీపీఓ శివారెడ్డి సూ చించారు. డీపీఓ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.డ్రైడేలో పాటించాల్సిన అంశాలపై వివరించా రు. తప్పని సరిగా పంచాయతీల్లో డ్రైడే అమలు చేసేలా సిబ్బందిని ఆదే శించామన్నారు. పంచాయతీల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు తప్పని సరిగా ఉదయాన్నే పంచాయతీల్లో ఉండాలన్నారు. తాగునీటి పైప్‌లైన లీకేజీ లుంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఎల్‌ఈడీ బల్బులు పగటి పూట వెలగకుండా చూడాలన్నారు. ఎనఆర్‌జీఎస్‌ కింద చేపట్టిన పనుల బిల్లు బకాయిలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.


Updated Date - 2021-08-27T05:48:39+05:30 IST