లేపాక్షి చిన్న చెరువుకు కృష్ణాజలాలు వదలండి

ABN , First Publish Date - 2021-05-03T05:13:50+05:30 IST

కృష్ణా జలాలు మండలంలోని అన్ని చెరువులకు అరకోరగా వదిలారు. అయితే లేపాక్షి చిన్న చెరువుకు మాత్రం నీళ్లను వద లడం మరిచిపోయారు.

లేపాక్షి చిన్న చెరువుకు కృష్ణాజలాలు వదలండి
లేపాక్షి చిన్న చెరువు

లేపాక్షి, మే 2: కృష్ణా జలాలు మండలంలోని అన్ని చెరువులకు అరకోరగా వదిలారు. అయితే లేపాక్షి చిన్న చెరువుకు మాత్రం నీళ్లను వద లడం మరిచిపోయారు. గత ప్రభుత్వం కూడా లేపాక్షి పెద్దచెరువుకు నీరువ దిలారేతప్పా చిన్న చెరువుకు నీరు వదలలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా లేపాక్షి పెద్దచెరువుకు వదిలారేతప్పా చిన్న చెరువుకు నీరు వదలడం లేదని ప్రశ్నించారు. లేపాక్షి చిన్న చెరువుకింద 158.78హెక్టార్ల సాగు భూమి ఉంది. బోర్లుకూడా అన్నీ ఎండిపోయి వ్యవసాయ భూమంతా బీడు భూమిగా మారింది. పదుల సంఖ్యలో బోర్లు నీరులేక అడుగంటిపోయాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా, అధికారులైనా పట్టించుకోలేదని రైతులు అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు లేపాక్షి చిన్న చెరువుకు నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-03T05:13:50+05:30 IST