ఉల్లిపాయల లారీ బోల్తా

ABN , First Publish Date - 2021-05-02T06:07:06+05:30 IST

మండలంలోని పెద్ద కొట్టాలపల్లి గ్రామం వద్ద ఉల్లిపాయల లారీ అదుపు తప్పి బోల్తా పడ టంతో ఆందోళన చెందిన లారీ డ్రైవర్‌ దిలీప్‌ (22) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉల్లిపాయల లారీ బోల్తా

ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న లారీ డ్రైవర్‌

విడపనకల్లు, మే1: మండలంలోని పెద్ద కొట్టాలపల్లి గ్రామం వద్ద ఉల్లిపాయల లారీ అదుపు తప్పి బోల్తా పడ టంతో ఆందోళన చెందిన లారీ డ్రైవర్‌ దిలీప్‌ (22) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విడపనకల్లు ఎస్‌ఐ గోపి తెలిపిన మేరకు... కడప జి ల్లా పులివెందుల నియోజకవర్గం సిద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దిలీప్‌ కర్ణాటకలోని బీజాపూర్‌ నుంచి తమిళనాడుకు శుక్రవారం రాత్రి లారీలో ఉల్లిపాయలను లోడ్‌ చేయించుకొని  బ యల్దేరాడు. పెద్దకొట్టాలపల్లి వద్దకు రాగానే లారీ అదుపుతప్పి బోల్తా ప డింది. లారీ యజమానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక భయపడిన డైవ్రర్‌ దిలీప్‌ లారీ లోడ్‌ కు ఉన్న నై లాన తాడును తీసుకుని పక్కనే పొ లంలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. ఉద యం పొలాలకు వెళ్లే కూలీలు గమనించి పోలీ సులకు సమాచారం అం దించారన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు.


ఉల్లిపాయాలు లూటీ 

శనివారం తెల్లవారు జామున ఉల్లిపాయల లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని లారీలోని ఉల్లిపాయలను తెల్లారేసరికి ఖాళీ చేసేశారు. కొట్టాలపల్లి, మాళాపురం, విడపనకలు,్ల ఉరవకొండ, తదితర గ్రామాలకు చెందిన కొందరు ఆటోల్లో, ట్రాక్టర్లలో, ద్విచక్ర వాహనాలలోను బస్తాలకు బస్తాలు ఎత్తుకెళ్లినట్లు అక్కడికి చేరుకున్న ప్రజలు తెలిపారు. లారీ డ్రైవర్‌ మృతి చెందిన విషయం తెలియక లారీ వద్ద ఎవరూ లేరని భావించి లూటీ చేశారు.


Updated Date - 2021-05-02T06:07:06+05:30 IST