పోలీసులు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా.?

ABN , First Publish Date - 2021-10-29T05:40:23+05:30 IST

పోలీసులు తప్పు చేస్తే ప్రశ్నిం చకూడదా అంటూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ మండిపడ్డారు.

పోలీసులు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా.?

మాజీ ఎమ్మెల్యే కందికుంట

కదిరి,  అక్టోబరు 28: పోలీసులు తప్పు చేస్తే ప్రశ్నిం చకూడదా అంటూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ మండిపడ్డారు. కొడుకు అసభ్యకర పోస్టు పెడితే దానితో ఏమా త్రం సంబంధం లేని వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని రాత్రి సమ యాల్లో స్టేషన్‌కు ఎలా పిలిపిస్తారని ప్రశ్నించారు. గురు వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను దిగజారి పోస్టులు పెట్టించేంత దీనస్థితిలో లేనన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై పోరాటం చేస్తామే తప్పా దొంగచాటు మా టలు మాట్లాడ మన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై నిజాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. అసభ్యకరపోస్టులు పెట్టారంటూ నాపై కేసు లు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు.  సోషల్‌ మీడియాలో అసభ్యక రమై న పోస్టులు పెట్టకూడదంటూ నిన్ననే ఐ టీడీపీ వారికి చెప్పానన్నారు. కొడాలి నాని, వంశీలు చేస్తున్న వ్యాఖ్యలపై కేసులు పెడితే బాగుం టుం దన్నారు. వృద్ధున్ని పోలీసుస్టేషన్‌కు రాత్రి సమ యంలో ఎందుకు తీసుకొచ్చారని పోలీసులను ప్రశ్నిస్తే మీకెం దుకన్నారు. పోలీసులు ము మ్మాటికి తప్పు చేశారని, దీని పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిం చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటే నీకెం దుకు లేకుంటే నీకెందుకు అని ప్రశ్నించారు. తనపై రెండు కేసు ల్లో అభియోగాలు మాత్రమే ఉన్నాయన్నారు. 

   ఎమ్మెల్యేపై ఫిర్యాదు: స్థానిక ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి ప్రోద్భలంతో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ అంజాద్‌ బాషా తమపై అసభ్యకర పోస్టులు పెడ్డాడని టీడీపీ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు బాబ్‌జాన్‌, రాజశేఖర్‌ బాబు, మారుతి కుమార్‌ తదితరులు గురువారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-10-29T05:40:23+05:30 IST