వైసీపీ బెదిరింపులకు భయపడవద్దు : ఎమ్మెల్సీ గుండుమల

ABN , First Publish Date - 2021-02-08T06:07:13+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని, గెలుపే లక్ష్యంగా అందరం సమిష్టిగా ముందుకు సాగుదామని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు.

వైసీపీ బెదిరింపులకు భయపడవద్దు : ఎమ్మెల్సీ గుండుమల
పార్టీలోకి చేరిన వారిని ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి


రొళ్ల, ఫిబ్రవరి 7: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని, గెలుపే లక్ష్యంగా అందరం సమిష్టిగా ముందుకు సాగుదామని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం రొళ్ల మండలం రత్నగిరి గొల్లహట్టి గ్రామంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని గ్రామాల్లోకి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తీసుకెళ్లాలన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క పనికూడా చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల గెలుపునకు కృషి చేద్దామని, భవిషత్తు తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. అనంతరం వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచి సిద్దప్ప, ఈరన్న, నాగన్న, గుడిబండ మండలం నాగేపల్లికి చెందిన నవీన్‌, దాసేగౌడ్‌, రవికుమార్‌, తిమ్మప్ప, తదితరులు పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో కన్వీనర్‌ దాసిరెడ్డి, మాజీ ఎంపీపీ కిష్టప్ప, మాజీ జడ్పీటీసీ సభ్యులు పాండురంగప్ప, నాయకులు రవిభూషన్‌, తదితరులు పాల్గొన్నారు. 


మడకశిరరూరల్‌: నాయకుల సమన్వయంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం గుండుమల పంచాయతీ కేంద్రంలో నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని నాయకులందరీ సమన్వయంతో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు సర్పంచి అభ్యర్థిగా గుండుమల చంద్రప్పను ఎన్నుకొన్నారు. అదేవిధంగా పంచాయతీ పరిధిలోని పది వార్డులలో వార్డుసభ్యులను సమన్వయంతో ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-08T06:07:13+05:30 IST