ఆర్డీటీకి దాతల విరాళం
ABN , First Publish Date - 2021-05-20T06:14:44+05:30 IST
కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్డీటీ చేపట్టిన స్పందించు..ఆక్సిజన అందించు కార్యక్రమానికి దాతలు స్పందించారు.

అనంతపురం క్లాక్‌టవర్, మే 19 : కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్డీటీ చేపట్టిన స్పందించు..ఆక్సిజన అందించు కార్యక్రమానికి దాతలు స్పందించారు. ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సంస్థ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్‌ను కలిసి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, రఫీక్, నాగప్ప, సాయికృష్ణ, నిరంజన, మోహనమూరళీ, ఆర్‌డీ వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు. దాతల విరాళాలు ఇలా...
- అనంతపురం పీవీసీ డ్రిప్ కంపెనీ సభ్యులు రూ.2.5లక్షలు విరాళం అందజేశారు.
- ధర్మవరానికి చెందిన ఆదర్శసేవాసంఘం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, నాగరాజు, సభ్యులు నాగభూషణం, నాగార్జున రూ.63,500, అనంతపురం నగరంలోని పాతూరు జనరల్ స్టోర్ నిర్వాహకులు విక్రం కుటుంబ సభ్యులు రూ.50వేలు, కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఎస్‌ఆర్‌ఎస్ మఠం మహేష్‌బాబు రూ.41,500 విరాళం అందజేశారు.
- అనంతపురం నగరానికి చెందిన మేడా సాయిబాబప్రసాద్ రూ.25వేలు, మరవకొమ్మ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్లు ఆదెన్న, గాదిలింగప్ప, రమేష్, శ్రీనివాసులు రూ.20,110, నగరానికి చెందిన వ్యాపారులు నరేంద్ర చౌదరి, శ్రీనివాసకుమార్ రూ.15వేలు, కదిరికి చెందిన నల్లచెరువు జెడ్పీహైస్కూల్ ఉపాధ్యాయురాలు రమాదేవి రూ.10వేలు విరాళం ఇచ్చారు.
రాప్తాడు: కరోనా బాదితులకు చికిత్సలు అందించేందుకు ఉపాధ్యాయులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటారు. గాండ్లపర్తి ఉన్నత పాఠశాల హెచఎం జయరామిరెడ్డి, ఉపాధ్యాయులు రూ. 16 వేల చెక్కును ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఏటీఎల్ వరకుమార్‌కు బుదవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ సీఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.