‘స్పందించు-ఆక్సిజన అందించు’కు విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2021-05-05T07:04:15+05:30 IST
కరోనా బాధితులను ఆదుకునేందుకు స్పందిం చు-ఆకి ్సజన అందించు అంటూ ఆర్డీటీ ఇచ్చిన పిలుపునకు

బత్తలపల్లి, మే4: కరోనా బాధితులను ఆదుకునేందుకు స్పందిం చు-ఆకి ్సజన అందించు అంటూ ఆర్డీటీ ఇచ్చిన పిలుపునకు అనం తపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చలం నవీనకుమార్‌రెడ్డి తన కుమారుడు హార్షిత రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రూ.18వేల చెక్కును రీజనల్ డైరెక్టర్ మల్లికార్జునకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థోమత కలిగిన వాళ్లు ముందుకొచ్చి కరోనాతో బా ధపడుతున్న వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీనకుమార్‌రెడ్డి భార్య కరుణ, అక్కింప్రతాప్ తదితరులు పా ల్గొన్నారు.
కదిరి: కరోనా బాధితులను ఆదుకునేందుకు స్పందించు-ఆకి ్సజన అందించు అంటూ ఆర్డీటీ ఇచ్చిన పిలుపునకు తమ వంతుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారు గంగాధర్ రూ. 10 వేలు ఆర్థికసాన్ని మంగళవారం అందజేశారు. ఆర్డీటీ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సలీంబాషా, గంగప్పలకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఉపాధ్యాయుడు మాట్లాడు తూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరికొంత మంది ముందుకొచ్చి తమ చేతనైన సాయాన్ని అందజేయాలని ఆయన కోరారు.
రామక్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో... రామక్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్పందించు - సహాయం అందించుకు రూ. 38 వేలు ఆర్థికసాయం అందజేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు: స్పందించు - ఆక్సిజన అందించుకు ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు ఫయాజ్ రూ. 2500, దేవరాజు, జయశ్రీ, నాగవేణి ఒక్కక్కొరు రూ. వెయ్యి, మస్తానరెడ్డి రూ. 1500, అనంతయ్య రూ. 500 మంగళవారం అందజేశారు. ఇప్పటి వరకు ఆర్టీసీ తరఫున రూ. 65 వేలు సాయం అందించారు.
ముదిగుబ్బ: స్పందించు-ఆక్సిజన అందించు కార్యక్రమానికి మేము సైతం అంటూ మండలంలోని మల్లేపల్లి పాఠశాల ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. మల్లేపల్లి పాఠశాల హెచఎం వెంకటనరసమ్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రూ.12వేలను ఆర్డీటీ ఖాతాకు పంపినట్టు పీఈటీ రజనీకాంత తెలిపారు.