‘స్పందించు - ఆక్సిజన అందించు’కు విరాళాలు

ABN , First Publish Date - 2021-05-11T06:03:41+05:30 IST

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగుల కోసం ‘స్పందించు - ఆక్సిజన అందించు’ అనే నినాదంతో ఆర్డీటీ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి జిల్లా పోలీసులు భారీ విరాళం అందజేశారు.

‘స్పందించు - ఆక్సిజన అందించు’కు విరాళాలు
మాంచోఫెర్రర్‌, విశాల ఫెర్రర్‌ దంపతులకు చెక్కు అందజేస్తున్న పోలీసు అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 10 :  కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగుల కోసం ‘స్పందించు - ఆక్సిజన అందించు’ అనే నినాదంతో ఆర్డీటీ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి జిల్లా పోలీసులు భారీ విరాళం అందజేశారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు సూచనల మేరకు సోమవారం ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్‌ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాం చోఫెర్రర్‌, ఆయన సతీమణి ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌ దంపతులకు రూ.10.16లక్షల చెక్కును అంద జేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల నుంచి సేకరించిన ఈ మొత్తాన్ని సేకరించినట్లు వారు తెలిపారు. ఆర్డీటీ చేస్తున్న వైద్య సేవలు అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఆర్ల శ్రీనివాసులు, ప్రసాద్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  రూ.72వేలు,  పావని ట్రావెన్స  నిర్వాహకులు, మిత్ర బృందం రూ.50వేలు,  నగరంలోని సాయి నగర్‌కు చెందిన షేక్షావలి, అస్మత బేగం దంపతులు రూ. 25వేల చెక్కును అందించారు. బొమ్మేపర్తి గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది రూ. 20 వేల చెక్కును  అందజేశారు. 

Updated Date - 2021-05-11T06:03:41+05:30 IST