ఆక్సిజన్‌ కోసం ఆర్డీటీకి విరాళం

ABN , First Publish Date - 2021-05-05T06:32:08+05:30 IST

కరోనా వ్యాధి అధికమై ఆక్సిజన్‌ అందక అనేక మంది చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు గీతారామ్మోహన్‌రెడ్డి, ఆర్డీటి ఆసుపత్రి స్వచ్చంద సేవా సంస్థవారికి ఆక్సిజన్‌ సిలెండర్ల కోసం రూ.10,500 ఆర్థిక సాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఆక్సిజన్‌ కోసం ఆర్డీటీకి విరాళం
ఆర్డీటి ప్రతినిధికి నగదును అందజేస్తున్న రామ్మోహన్‌రెడ్డి

పెనుకొండ, మే 4: కరోనా వ్యాధి అధికమై ఆక్సిజన్‌ అందక అనేక మంది చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు గీతారామ్మోహన్‌రెడ్డి, ఆర్డీటి ఆసుపత్రి స్వచ్చంద సేవా సంస్థవారికి ఆక్సిజన్‌ సిలెండర్ల కోసం రూ.10,500 ఆర్థిక సాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.  మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీటి ప్రతినిధులకు రామ్మోహన్‌రెడ్డి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, సూపరింటెండెంట్‌ సుబ్రమణ్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T06:32:08+05:30 IST