కరోనా సహాయనిధికి విరాళం

ABN , First Publish Date - 2021-05-30T05:56:32+05:30 IST

30 ఆక్సిజన పడకల ఏర్పాటుకు తమవంతు సాయంగా పట్టణానికి చెందిన పలువురు విరాళాలను అందిస్తున్నారు

కరోనా సహాయనిధికి విరాళం

ధర్మవరంఅర్బన, మే 29: కరోనా బాధితులకోసం ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేయనున్న 30 ఆక్సిజన పడకల ఏర్పాటుకు తమవంతు సాయంగా పట్టణానికి చెందిన పలువురు విరాళాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ల యన్సక్లబ్‌ ప్రతినిధులు రూ.61 వేలు ఆర్డీఓ మదుసూదనకు అందజేశారు. 30ఆక్సిజన పడకల ఏర్పాటుకు మరింతమంది దాతలు ముందుకురావాలని ఆర్డీఓ పేర్కొన్నారు. వి రాళాన్ని అందించిన వారిలో క్లబ్‌ ప్రతినిధులు పిట్టావెంకటస్వామి, శివప్రసాద్‌, లయనచం దా, నాగరాజు, మోహన, గోసేరాధాక్రిష్ణ, మెటికల కుళ్లాయప్ప, శాగా సురేశ, రామాం జినేయులు పాల్గొన్నారు.

ముదిగుబ్బలో: మండల కేంద్రంలోని రాయలసీమ ప్రజావైద్యశాల రిటైర్డు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ క్రిష్ణయ్య స్పందించు-ఆక్సిజన అందించుకు రూ.50వేలచెక్కును అందిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓసీఓ సోమశేఖర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-30T05:56:32+05:30 IST