నా భూములను ఇతరులకు రిజిస్ర్టేషన చేయొద్దు

ABN , First Publish Date - 2021-12-30T05:53:52+05:30 IST

తన భ ర్తకు చెందిన భూములను తనకు తె లియకుండా అత్త, మామలు వారి కూ తురికి ఎలా రిజిస్టర్‌ చేస్తారని కోడలు లక్ష్మీప్రసన్న స్థానిక సబ్‌ రిజిస్ర్టార్‌ కా ర్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

నా భూములను ఇతరులకు రిజిస్ర్టేషన చేయొద్దు
సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మీప్రసన్న



-సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌ వద్ద ఓ మహిళ నిరసన

శింగనమల, డిసెంబరు29 : తన భ ర్తకు చెందిన భూములను తనకు తె లియకుండా అత్త, మామలు వారి కూ తురికి  ఎలా రిజిస్టర్‌ చేస్తారని కోడలు లక్ష్మీప్రసన్న స్థానిక సబ్‌ రిజిస్ర్టార్‌ కా ర్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే... నా ర్పల మండలంలోని పులసనూతల గ్రా మానికి చెందిన గాజుల లక్ష్మన్న, పద్మా వతి దంపతులకు పులసనూతల రెవె న్యూ గ్రామ పొలంలో సర్వే నెంబరు 516లో 3.83 ఎకరాలు, 474 సర్వే నెంబరులో 3.76 ఎకరాల భూమి ఉంది. వీరికి కుమారుడు వెంకటరాముడు, కుమార్తె శ్రీలత ఉన్నారు. వెంకటరాముడికి ఉ రవకొండకు చెందిన లక్ష్మీప్రసన్నతో వివాహమైంది. అయితే 2019 ఆగస్టు 19న వెంకటరాముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి కోడలు, అత్తమామల మధ్య సయోధ్య లేదు. దీంతో లక్ష్మన్న, పద్మావతి తమకున్న భూ మిని మొత్తం కుమార్తె పేరు మీద రిజిస్ర్టేషన చేయడానికి రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న లక్ష్మీప్రసన్న బుధవారం శింగనమల రిజిస్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకుంది. తన భర్త భూములను తన సంతకం లేకుండా వారు ఎలా కూతురికి రిజిస్టర్‌ చేస్తారని అక్కడే కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం భూములు రిజిస్ర్టేషన చేయవద్దని సబ్‌ రిజిస్ర్టార్‌ నరసింహమూర్తికి వినతి ప త్రం అందజేశారు. సబ్‌ రిజిసా్ట్రర్‌ మాట్లాడుతూ... ఈ వ్యవహారంపై రెవెన్యూ శా ఖతో పాటు కోర్టు నోటీసు తీసుకురావాలన్నారు. లేదా రిజిస్ర్టేషన ఆపవచ్చని  రెవెన్యూ అధికారుల నుంచి మాకు ఫిర్యాదు వచ్చినా రిజిస్ర్టేషన చేయమన్నారు. ఇది జరుగుతుండగానే దంపతులు రిజిస్ర్టేషన చేయకుండానే తిరిగి వెళ్లారు. 

Updated Date - 2021-12-30T05:53:52+05:30 IST