కౌంటింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి

ABN , First Publish Date - 2021-03-14T06:17:34+05:30 IST

పట్టణంలో ఆదివారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సిరి మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునను ఆదేశించారు.

కౌంటింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి

-మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించిన జేసీ సిరి

ధర్మవరంఅర్బన, మార్చి13: పట్టణంలో ఆదివారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సిరి మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునను ఆదేశించారు. శనివారం స్థానిక బీఎ్‌సఆర్‌ బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని వార్డులకు ఎన్నికలు జరిగాయని, ఎన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్‌బాక్స్‌లను భద్రపరిచారని కమిషనర్‌ను అడిగితెలుసుకున్నారు. కౌంటింగ్‌కు ఎన్ని కేంద్రాలను ఏర్పాటుచేశారని, అందుకు ఎంతమంది సిబ్బందిని నియమించారని, ఈ కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టారా అని తదితర విషయాలను కమిషనర్‌ ద్వారా జేసీ ఆరా తీశారు.


Updated Date - 2021-03-14T06:17:34+05:30 IST