ప్లాస్టిక్‌ బియ్యం వదంతులు నమ్మొద్దు : ఐసీడీఎస్‌ పీడీ

ABN , First Publish Date - 2021-10-19T06:05:23+05:30 IST

అంగనవాడీల ద్వారా సరఫరా చేస్తున్నది ప్లాస్టిక్‌ బియ్యం అంటూ అనేకచోట్ల వదంతులు సృష్టిస్తున్నారనీ, వాటిని నమ్మొద్దని ఐసీడీఎస్‌ పీడీ సుజన తెలిపారు.

ప్లాస్టిక్‌ బియ్యం వదంతులు నమ్మొద్దు  : ఐసీడీఎస్‌ పీడీ

అనంతపురం వైద్యం, అక్టోబరు 18: అంగనవాడీల ద్వారా సరఫరా చేస్తున్నది ప్లాస్టిక్‌ బియ్యం అంటూ అనేకచోట్ల వదంతులు సృష్టిస్తున్నారనీ, వాటిని నమ్మొద్దని ఐసీడీఎస్‌ పీడీ సుజన తెలిపారు. సోమవారం ఆమె ఈ వదంతులపై వివరణ ఇచ్చారు. అంగనవాడీ కేంద్రాలకు పౌరసరఫరాల సంస్థ ద్వారా ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. కొంతమంది లబ్ధిదారులతోపాటు స్థానికులు ప్లాస్టిక్‌ బియ్యం అంటూ అపోహలతో తమ దృష్టికి తెస్తున్నారన్నారు. ఈ రైస్‌ను ల్యాబ్‌కు  పరీక్షల నిమిత్తం పంపామన్నారు. అక్కడ కూడా ఈ రైస్‌ హానికరం కాదని పైగా పౌష్టికాహార లోపం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడతాయని సర్టిఫై చేసి, ఇచ్చారన్నారు. అందుకే ఫోర్టిఫైడ్‌ రైస్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అసవరం లేదని పీడీ కోరారు.

Updated Date - 2021-10-19T06:05:23+05:30 IST