ఒక్క ఇసుక రేణువు తరలించేందుకూ ఒప్పుకోం

ABN , First Publish Date - 2021-05-21T06:34:48+05:30 IST

మండలంలోని నిడదనవాడ ఇసుక రీచ నుంచి ఒక ఇసుక రేణువు తరలించేందుకూ తాము ఒప్పుకోమని గ్రామస్థులు, రైతులు పేర్కొన్నారు.

ఒక్క ఇసుక రేణువు తరలించేందుకూ ఒప్పుకోం
నిడదనవాడలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, గ్రామస్థులు


నిదనవాడ గ్రామస్థుల నిరసన

శింగనమల, మే20 : మండలంలోని నిడదనవాడ ఇసుక రీచ నుంచి ఒక ఇసుక రేణువు తరలించేందుకూ తాము ఒప్పుకోమని గ్రామస్థులు, రైతులు పేర్కొన్నారు. రీచ నుంచి ఇసుక తరలించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గ్రామంలోని రామస్వామి దేవాల యం వద్ద గ్రామ పెద్దలు, గ్రామస్థులు, రైతులు ఇసుక తరలిం చకుండా అడ్డుకోవడానికి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఇలా తెలిపారు. పెన్నానది పరివాహక ప్రాం తంలో నిడదనవాడ గ్రామం వద్ద ప్రభుత్వం ఇసుక రీచ మంజూ రు చేసింది.  టీడీపీ హయాంలో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో నిడదనవాడ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గిపోతాయని రైతులు, గ్రామస్థులు ఇసుక తరలింపును అడ్డుకున్నారు. మళ్లీ వైసీపీ అధికారం లోకి రాగానే ఇక్కడి నుంచి ఇసుక తరలించడానికి వైసీ పీ నాయకులు, అధికారులు మరోసారి ప్రయత్నం చేశారు. అప్పు డూ గ్రామస్థులు అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఈ రీచు నుంచి ఇసుకను తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా... ఈసారి ఇసుక తరలింపులను అడ్డుకుంటే అక్రమ కేసు లు పెడుతామని మూడు రోజుల నుంచి  గ్రామపెద్దలకు స్థానిక పోలీసుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి ఇక్కడి ఇసుక రీచ నుంచి మళ్లీ ఇసుక తరలిం చాలని పక్కా ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించారు.  గ్రామానికి చెందిన పొలాలకు పెన్నానది నుంచి దాదాపు 5 కి.మీకుపైగా పైపులైన ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా పంటలకు నీటిని సరఫ రా చేసుకుంటున్నామని తెలిపారు. ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయని, ఏ అధికార పార్టీ నాయకులు, పైస్థాయి అధికారులు వచ్చినా ఇసుక రీచ నుంచి ఇసుక తర లించేం దుకు తాము ఒప్పుకోమన్నారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే ప్రాణత్యా గానికైనా సిద్ధమని  హెచ్చరించారు. అయితే ఇసుక తరలింపులో స్థానిక ప్రజాప్రతినిధి బంధువులు గ్రామస్థులతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2021-05-21T06:34:48+05:30 IST