80 శాతం సబ్సిడీతో పప్పుశనగ పంపిణీ

ABN , First Publish Date - 2021-11-28T06:18:26+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పప్పుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో విత్తన పప్పు శనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇనచార్జ్‌ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.

80 శాతం సబ్సిడీతో పప్పుశనగ పంపిణీ

పంటనష్టపోయిన రైతులందరికీ పరిహారం 

మంత్రి బొత్స సత్యనారాయణ

అనంతపురం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పప్పుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో విత్తన పప్పు శనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇనచార్జ్‌ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక రెవెన్యూ భవనలో జిల్లాలో వరదలు, భారీ వర్షాల మూలంగా జరిగిన నష్టాలపై ప్రజాప్రతినిధులు, యంత్రాంగంతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలతో 1.17 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. త్వరలో సంబంధిత అధికారుల ద్వారా పంట నష్టంపై అధ్యయనం చేయిస్తామన్నారు. 1500 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం పంటనష్టంపై డిసెంబరు 6వ తేదీలోపు నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. జిల్లావ్యాప్తంగా 159 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. వాటిలో 67 పక్కా ఇళ్లు కాగా.. 92 కచ్చా గృహాలన్నారు. మరో 2153 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు వెల్లడించారు. వారందరికీ పరిహారం అందజేస్తామన్నారు జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలతో 61 మండలాల్లో 20924 మంది ప్రజలు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారన్నారు. 15 గ్రామాలు, 4 పట్టణాల్లోకి వర్షం, వరద నీరు చేరటం వల్ల ఏడుగురు చనిపోయినట్టు తెలిపారు. వారిలో ఆరుగురు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున రూ.30 లక్షలు అందజేస్తామన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక చర్యలు చేపట్టామన్నారు. రెస్క్యూ అండ్‌ రిలీఫ్‌ ఆపరేషన్సలో భాగంగా 5 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎనడీఆర్‌ఎ్‌ఫ బృందాల ద్వారా 2298 కుటుంబాలకు చెందిన 10509 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వారికి భోజన సౌకర్యం కల్పించామన్నారు. 262.45 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15 రిలీఫ్‌, 19 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 4014 బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు చొప్పున రూ.80.28 ల క్షలు తక్షణసాయంగా అందించామన్నారు. రహదారుల పునర్నిర్మాణానికి వేగం గా చర్యలు చేపడుతున్నామన్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్న నేపథ్యంలో రూ.215 కోట్లదాకా నష్టం జరిగి ఉంటుందని సంబంధిత శాఖాధికారులు అం చనా వేశారన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోనే 231 కి.మీ., మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో రాబోవు రోజుల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగానికి  ఆదేశాలు జారీ చేశామన్నారు.

Updated Date - 2021-11-28T06:18:26+05:30 IST