ముంచిన వానలు... బూజు పట్టిన పంటలు
ABN , First Publish Date - 2021-11-17T06:13:47+05:30 IST
మండలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను వరుస వానలు నిలువునా ముంచాయి. కోత కోసిన పంట తడిసి అపార నష్టాన్ని మిగిల్చింది.
వేరుశనగ, మొక్కజొన్న, వరి రైతుకు కన్నీరు
బొమ్మనహాళ్, నవంబరు 16: మండలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను వరుస వానలు నిలువునా ముంచాయి. కోత కోసిన పంట తడిసి అపార నష్టాన్ని మిగిల్చింది. హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఖరీఫ్ సీజనలో 700 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఉద్దేహాళ్, దేవగిరి, దేవగిరి క్రాస్, గోవిందవాడ, బొమ్మనహాళ్, బండూరు, హరేసముద్రం తదితర గ్రామాలలో మొక్కజొన్న విస్తారంగా సాగైంది. ఇప్పటికే 30 శాతం మందికి పైగా రైతులు చేతికొచ్చిన మొక్కజొన్నను కోసి ఆరబోశారు. ప్రస్తుతం కు రుస్తున్న వరుస వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. బూజు పట్టి నల్లగా మారాయి. తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చే యాలని రైతులు వేడుకుంటున్నారు. ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతు లు ఆందోళనలో పడ్డారు. మొక్కజొన్న రాశులను టార్ఫాలినలు కప్పి వుం చారు. దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని, వారికి విక్రయిస్తే కనీ సం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. దళారులు క్వింటా రూ.1550 నుంచి రూ.1600 వరకు బేరాలు పెడుతున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. నూర్పిడుల సమయంలో వర్షాలు రావడంతో కొన్ని రోజులుగా ఆరబోసేందుకు అవకాశం లేకపోయింది. దీంతో గింజలు బూ డిద రంగులో మారాయి. అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో శ్రద్ధ చూపలేదని, నిల్వ చేసుకునే అవకాశంలేక రైతులు దిగాలు పడుతున్నారు.
కుందుర్పి: మండలంలోని పలు గ్రామాల్లో సాగైన వేరుశనగ, వరి పం ట జడివాన ప్రభావంతో పూర్తిగా దెబ్బతింది. వారం రోజులుగా కురుస్తున్న వానకు పొలాల్లో కోత కోసి కుప్పలు వేసిన వేరుశనగ కట్టె తడిసి బూజు పట్టింది. తూముకుంట గ్రామ రైతు నాగభూషణ నాలుగు ఎకరాల్లో చేతికొ చ్చిన వేరుశనగను కోత కోసి పొలంలోనే కుప్పలు పోశాడు. అంతలోనే జడివానకు తడిసి ముద్దయింది. కాయలు మొలకెత్తి పాడైపోయాయి. పశుగ్రా సం సైతం పనికి రాకుండా పోయింది. దీనితో బాధిత రైతు రూ.లక్ష దాకా నష్టపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
కూడేరు: మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 18 వేల హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. పంట కోత దశకు వచ్చే సరికి తుఫాన్లు రైతులకు నష్టాలు మిగిల్చాయి. ఖరీఫ్ సీజనలో మండలం లో 11605 హెక్టార్లలో వేరుశనగ పంట సాగుచేశారు. కూడేరు, కడదరకుం ట, చోళసముద్రం, కరుట్లపల్లి, ఇప్పేరు, కమ్మూరు, ముద్దలాపురం, జల్లిపల్లి, గొట్కూరు, కొర్రకోడు తదితర గ్రామాల్లో పంట కోత దశకు వచ్చింది. దీం తో అన్నదాతలు పంటను తొలగించారు. ఓవైపు దిగుబడి లేకపోవడం, మ రోవైపు తుఫాన ప్రభావంతో పంట మొత్తం దెబ్బతింది. ఉన్న రెండు మూ డు కాయలు కూడా వర్షానికి దెబ్బతినడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నా రు. ఎకరాకు దాదాపు రూ.10 వేల నుంచి 15 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటసాగు చేస్తే చివరికి అప్పులుమిగిలాయని అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
పెద్దన్న, రైతు, కడదరకుంట
అప్పులు చేసి ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేశా. తీరా పంట కోత దశలో వర్షాలకు పూ ర్తిగా దెబ్బతింది. పశుగ్రాసం కూడా దక్కకుండా పోయింది. తుఫాన వర్షాలు నష్టాలను మిగిల్చా యి. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
