అనంతలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది..

ABN , First Publish Date - 2021-12-08T05:44:06+05:30 IST

జిల్లాలో మూడేళ్లుగా పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణాటాటా పేర్కొన్నారు.

అనంతలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది..

డీఐజీ కాంతిరాణాటాటా

అనంతపురం క్రైం, డిసెంబరు 7: జిల్లాలో మూడేళ్లుగా పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణాటాటా పేర్కొన్నారు. విజయవాడ సీపీగా ఆయన బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో స్థానిక జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో జిల్లా పోలీసు యంత్రాంగం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ముందుగా ఆయన  పరేడ్‌ను పరిశీలించి, సిబ్బంది నుంచి గౌరవంద నం స్వీకరించారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసులకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఫ్యాక్షన, నేరా ల కట్టడికి ఏమాత్రం తలొగ్గకుండా కృషి చేశారన్నారు. రాష్ట్ర డ్యూ టీ మీట్‌లలో కూడా ప్రతిభ కనబరిచారని కొనియాడారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి జిల్లాలో పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నా రు. పోలీసు పిల్లల్లో కూడా ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కలిగి న వారు ఉన్నారని వారందరూ ఉన్నతస్ధాయికి ఎదగాలని ఆకాంక్షించా రు. అనంతరం ఆయనకు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పతోపాటు ప లువురు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. చివరగా ప్రత్యేక వాహనంలో ఎక్కించి, రోప్‌ ద్వారా పోలీసు లు లాగి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నాగేంద్రుడు, రామకృష్ణప్రసాద్‌, హనుమంతు, డీఎస్పీలు ఉమామహేశ్వరరెడ్డి, ఆర్ల శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, ప్రసాదరావు, పీటీసీ డీఎస్పీలు మల్లికార్జువర్మ, అల్లాబకాష్‌, శ్రీనివాసులు, పలువురు సీఐలు ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, జిల్లా పోలీసు అధికారుల అడ్‌హక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:44:06+05:30 IST