సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల ధర్నా

ABN , First Publish Date - 2021-07-13T05:29:17+05:30 IST

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సీఐటీయూ ఆద్వర్యంలో వీఆర్‌ఏలు ధర్నా చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల ధర్నా

పెనుకొండ, జూలై 12: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సీఐటీయూ ఆద్వర్యంలో వీఆర్‌ఏలు ధర్నా చేపట్టారు. సోమవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌ ఆధ్వర్యంలో వీఆర్‌ఏల నాయకులు ఆంజనేయులు, చెన్నకేశవులు, పుల్లన్న, సుబ్బరాయుడు, గంగాధర్‌, రాధమ్మ, లింగమ్మ ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనం రూ.21వేలు ఇవ్వాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం తహసీల్దార్‌ నాగరాజుకు వినతిపత్రం అందించారు. 

హిందూపురం టౌన: వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం నాయకులు లక్ష్మీనరసప్ప, నారాయణప్ప, గంగప్పలు మాట్లాడుతూ కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గంగాధరప్ప, నరసింహప్ప, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

మడకశిరరూరల్‌: వేతనాలు పెంచకపోతే దశలవారీగా ఆందోళన చేపడుతున్నట్లు వీఆర్‌ఏ మండల అధ్యక్షుడు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాగరాజులు తెలిపారు. తహసీల్దార్‌ ఆనందకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.


Updated Date - 2021-07-13T05:29:17+05:30 IST