అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఆర్డీ

ABN , First Publish Date - 2021-05-30T06:08:41+05:30 IST

పురపాలక సంఘం పరిధిలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు మున్సిపల్‌ అ ధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఆర్డీ
ఆర్డీతో చర్చిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన, కమిషనర్‌

రాయదుర్గం టౌన, మే 29 : పురపాలక సంఘం పరిధిలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు మున్సిపల్‌ అ ధికారులను ఆదేశించారు. పురపాలక సంఘం కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు వెల్ఫేర్‌ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌ బీమా పథకం పెండింగ్‌ దరఖాస్తులను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కమిషనర్‌ ఛాంబర్‌లో మున్సిపల్‌ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఆస్తి, నీటి  పన్ను వసూళ్లపై చర్చించారు. సాధ్యమైనంత త్వరలో లక్ష్యాన్ని పూర్తి చే యాలని కోరారు. అనంతరం పట్టణంలోని భంభంస్వామి లేఔట్‌, బీటీపీ లేఔట్‌లో నిర్మిస్తున్న హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ యా పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కంపోస్టుయార్డును తనిఖీ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన పొ రాళ్లు శిల్ప, వైస్‌ చైర్మన శ్రీనివాసయాదవ్‌లు ఆర్‌డీని కలసి పట్టణ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా, డీఈ రామ్మూర్తి, ఏఈ వీరేష్‌, మేనేజర్‌ ఖాదర్‌ మోహిద్దీన, శానిటరీ ఇనస్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌, ఆర్‌ఐ మహబూబ్‌ బాషా పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T06:08:41+05:30 IST