వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2021-10-20T05:59:13+05:30 IST

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
బొమ్మేపర్తిలో రైతులతో కలిసి నిరసన తెలుపుతున్న పరిటాల సునీత


- విద్యుత చార్జీలు తగ్గించి రైతులను ఆదుకోవాలి

: మాజీ మంత్రి పరిటాల సునీత

రాప్తాడు, అక్టోబరు 19: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. విద్యుత చార్జీల పెంపుపై మంగళవారం బొమ్మేపర్తిలో రైతులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా గ్రామాల్లో ఒక్క సీసీ రోడ్డు కూడా నిర్మించలేదన్నారు.  అధికారంలోకి వస్తే విద్యుత చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన అధికారంలోకి వచ్చాక విద్యుత చార్జీలు అధికంగా పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో పేదల నుంచి అధికంగా వసూలు చేస్తూ వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారన్నారు. అంతే కాకుండా విద్యుత కోతలు అధికంగా విధిస్తున్నారన్నారు. వ్యవసాయానికి  కూ డా  కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలీదన్నారు. పెట్రోలు, డీజి ల్‌, గ్యాస్‌ ధరలు అధికంగా పెంచడం వలన సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి 7 గంటలు కరెంటు అంతరాయం లేకుండా సరఫరా చేశారన్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా వ్యసాయ పరికరాలు, డ్రిప్పు, స్పింకర్లు, ఎరువులు అందజేశారన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతు రథం ద్వారా తక్కువ ధరకు ట్రాక్టర్లు పంపిణీ చేశారన్నారు. విద్యుత చార్జీలు తగ్గించి ట్రూఅప్‌ చార్జీలు రద్దు చేయాలన్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పరికరాలు అందించి ఆదుకోవాలన్నారు. వ్యవసాయ మీటర్లకు పంపుసెట్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏఏ పనులు చేస్తున్నారో ముఖ్యమంత్రి గమనించాలన్నారు. అధికార పార్టీ మంత్రులు ప్రజలు, రైతుల సమస్యలపై స్పందించడంలేదన్నారు. కేవలం చంద్రబాబును తిట్టేందుకు మాత్రమే మంత్రులు బయటకు వస్తారన్నారు. సమస్యలు పరిష్కరించే మంత్రులు ఒక్కరూ లేరన్నారు. మంత్రులు ప్రజల్లో తిరిగి సమస్యలు పరిష్కరించాలన్నారు. 

 అలాగే రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు జమ అయితే వైసీపీ నాయకులు 10 నుంచి 30 శాతం వరకూ కమీషన్లు వసూలు చేస్తూ టీడీపీ నాయకుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కమీషన్లు ఇవ్వకపోతే చెక్కులు రాసి ఇవ్వద్దని సచివాలయ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారన్నారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నారాయణస్వామి, ధర్మవరపు మురళి, ఎంపీటీసీ జాఫర్‌ఖాన, సర్పంచ శీనయ్య, నాయకులు గంగలకుంట రమణ, గోపాల్‌, ఇంద్ర, కొండప్ప, రాము, రామాంజనమ్మ, హిందూపురం పార్లమెంట్‌ తెలుగుయువత అధికార ప్రతినిది మరూరు బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేష్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు చంద్రమోహనరెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

కనగానపల్లి: అసమర్థత, అనుభవంలేని వైసీపీ పాలనతోనే రాష్ట్రంలో విద్యు త లోటు ఏర్పడి రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుతకోతలను నిరసిస్తూ మండలంలోని తల్లిమడుగుల గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి ఆమె మంగళవారం నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీమంత్రి మాట్లాడుతూ బొగ్గుకొరత, విద్యుతడిమాండ్‌ ఏర్పడుతుందని ముందే హెచ్చరించినా... సీఎం జగనకు ముం దుచూపులేని కారణంగా విద్యుతరంగం సంక్షోభంలో పడిందన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా విద్యుత సంక్షోభాన్ని కేంద్రంపై నెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయ త్నిస్తోందని విమర్శించారు. వర్షాకాలంలోనే విద్యుతకోతలు ఇలా ఉంటే ఇంకా వేసవి కాలంలో ఎలా ఉంటుందోనని ఎద్దేవా చేశారు. రాయలసీమ పవర్‌ప్లాంట్‌ను ఎందుకు మూసివేశారో ప్రజలకు తెలపా ల్పిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యుత పరిస్థితులు ఇలాగే ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ముత్తవకుంట్ల సర్పంచ ఈడిగ రామాంజనేయులు, మాజీ సర్పంచ పతకమూరి ఆంజనేయులు, ఎంపీటీసీ సరిపూటి శ్రీరాములు, తెలుగుయువత నాయకులు మనోహర్‌నాయుడు, తూంచెర్ల హరి, అనిత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:59:13+05:30 IST