ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ తహసీల్దార్‌?

ABN , First Publish Date - 2021-08-27T06:45:56+05:30 IST

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డికి చెందిన 68 సెంట్ల అసైన్డ భూమి ఆనలైన ఎక్కించడంపై నెలకొన్న వి వాదం, వీఆర్వోలతో కలిసి గోవా టూర్‌ వెళ్లడంపై జరిగిన దుష్ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు కలిసి వివరణ ఇచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం.

ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ తహసీల్దార్‌?

భూ వివాదం, గోవా టూర్‌పై వివరణ


తాడిపత్రి, ఆగస్టు 26: టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డికి చెందిన 68 సెంట్ల అసైన్డ భూమి ఆనలైన ఎక్కించడంపై నెలకొన్న వి వాదం, వీఆర్వోలతో కలిసి గోవా టూర్‌ వెళ్లడంపై జరిగిన దుష్ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు కలిసి వివరణ ఇచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ రెండింటిపై ఐదురోజులుగా తహసీల్దార్‌ కార్యాలయంలో చర్చకు దారితీస్తోంది. వైసీపీ మద్ధతుదారుని సమాచారంతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మె ల్యే పెద్దారెడ్డి తనదైన శైలిలో అధికారులపై మండిపడ్డారని సమాచారం. ఈ వివాదానికి డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు కేంద్రబిందువుగా మారాడన్న దానిపై అతన్ని సెలవులో పంపాలని ఎమ్మెల్యే ఆదేశించడం.. అం దుకు అనుగుణంగా ఆయన సెలవులో వెళ్లడం తెలిసిందే. తహసీల్దార్‌తోపాటు కిందిస్థాయి అధికారులు సైతం తనను టార్గెట్‌చేసి సెలవులో పం పించారన్న మనస్తాపంతో నిజానిజాలను వివరించి దోషులు ఎవరో చె ప్పేందుకు రెండురోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు కొందరు వీ ఆర్వోలు కలిసి హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే వద్దకు వెళ్లారని తెలుస్తోం ది.


2019 ఎన్నికలకు ముందు తాడిపత్రి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న త నను వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న దానిపై అప్పట్లో టీడీపీ నాయకు లు శింగనమలకు బదిలీ చేయించారని, 2019లో వైసీపీ అధికారంలోకి రా వడంతో పాటు తాడిపత్రి ఎమ్మెల్యేగా మీరు గెలవడంతో తిరిగి తాడిపత్రికి పోస్టింగ్‌ తెచ్చుకున్నానని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. అ లాంటప్పుడు టీడీపీకి అనుకూలంగా, మీకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తాన ని.. కేవలం అధికారులు, సిబ్బంది ఆడిన డ్రామాలో తాను బలిపశువు కా వాల్సి వచ్చిందని వాపోయినట్లు సమాచారం. కొంతకాలంగా తీవ్రమైన ప నిఒత్తిడితో పాటు ఇతర ఒత్తిడులను తట్టుకొని పనిచేస్తున్నా పనిగట్టుకొని తనపై ఫిర్యాదులు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారని తెలుస్తోంది. తనతోపాటు మరికొందరు వీఆర్వోలు కలిసి గోవా టూర్‌ వెళ్లడాన్ని కూడా వివా దం చేయడమే కాకుండా మీ దృష్టికి తీసుకువచ్చి బురదజల్లే ప్రయత్నం చేశారని వాపోయినట్లు తెలిసింది. మేము గోవాకు వెళ్లిన సమయంలో యాదృచ్ఛికంగా టీడీపీకి చెందిన కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్‌, సీపీఐ కౌన్సిలర్లను గోవాతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు టీడీపీకి చెందిన మున్సిప ల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సొంత ఖర్చులతో పంపించారని ఆయనకు వి వరించారని సమాచారం. వారితోపాటు మేము కూడా వెళ్లామంటూ దు ష్ప్రచారం చేశారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. వీరి వివర ణ విన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన తర్వాత అందరిని పిలిపిం చి మాట్లాడుతానని వారికి చెప్పి పంపించారని తెలుస్తోంది. మరోవైపు వి వాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గుత్తికి బదిలీ చేయించుకొనేందుకు డిప్యూటీతహసీల్దార్‌ ప్రయత్నాలు ప్రా రంభించారని సమాచారం.


భూ వివాదంపై ఆర్డీఓ ఆరా

టీడీపీ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డికి చెందిన అసైన్డభూమి ఆనలైన ఎక్కించడంలో చోటుచేసుకున్న వివాదంపై ఆర్డీఓ మధుసూదన ఆరా తీశారని అ త్యంత విశ్వసనీయ సమాచారం. వివాదానికి సంబంధించి కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తీరుపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ నాగభూషణంను ఆదేశించారని తెలిసింది. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడానికి కారణాలు, డీటీ సెలవులో వెళ్లడంపై ఆర్డీఓ వివరాలు అడిగారని సమాచారం. 

Updated Date - 2021-08-27T06:45:56+05:30 IST