రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగు : టీడీపీ

ABN , First Publish Date - 2021-12-25T06:26:20+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని గుం తకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని షాదీఖానాలో శుక్రవారం గౌరవ సభ నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగు : టీడీపీ
పామిడి సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌

పామిడి, డిసెంబరు 24: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని గుం తకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని షాదీఖానాలో శుక్రవారం గౌరవ సభ నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింకల రామకృష్ణ, వడ్డే శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మా జీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, జిల్లా కా ర్యనిర్వాహక కార్యదర్శి కేసీ హరి, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మినారాయణరెడ్డి హాజరై మా ట్లాడారు. అపద్దపు హామీలు, కల్లిబొల్లి మాటలతో వైసీపీ అధికారంలోకి వచ్చి  ప్రజలను దోచుకుంటోందన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు. చట్టసభలో ప్రతిపక్షనేత ఇల్లాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మానసిక క్షోభకు గురిచేయడం సిగ్గుచేటని రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు వెంకటేష్‌, ప్రభాకర్‌చౌదరి, ఆనంద్‌, గౌస్‌పీరా, వైయూ రామాంజనేయులు, చెన్నవరం మ హబూబ్‌బాషా, జింకల సంజీవకుమార్‌, జయకుమార్‌, శ్రీనివాసులు, మహమ్మద్‌ రఫీ, పల్లె శ్రీనివాసులు, సుదర్శన బాబు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం: టీడీపీతోనే సువర్ణ పాలన సాధ్యమని నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలో ని హులికల్లు, ఓబుళాపురం, మానిరేవు గ్రామాల్లో గౌరవసభలు నిర్వహించా రు. ఓబుళాపురంలో వ్యవసాయ కూలీలు మద్దతు తెలిపారు. ఓటీఎస్‌ మో సాలను ఆయన కూలీలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. బుద్ధుంటే ఆ మహనుభావునికి ఓటేస్తే ఓట్టని వైసీపీ ప్రభుత్వానికి కూలీలు తెగేసి చెప్పా రు. అనంతరం సభలో ఉమా మాట్లాడుతూ వైసీపీ దౌర్భగ్య పాలనలో సామా న్యుల బతుకులు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. మరోసారి మోసంచేసేందుకు ఓటీఎ్‌సను తెరపైకి తెచ్చి అధికారులపై ఒత్తిడి పెంచారన్నారు.  మోసపూరిత మాటలను నమ్మి వేలాది రూపాయల డబ్బు వెచ్చించి ఓటీఎస్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉ చితంగా ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ఓటీఎస్‌పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని ము రళి, తలారి సత్యప్ప, రామరాజు, ఓబుళాపురం తిమ్మప్ప, పోస్టు పాలన్న, కొల్ల ప్ప, రంజితయాదవ్‌, నాగరాజు, చిదానంద, శ్రీరాములు, నాతేనాయక్‌, వెంకటేష్‌ నాయక్‌, బొజ్జప్ప, రామచంద్ర, నవీనచౌదరి, వెంకటేశులు, నల్లజప్ప, నాగభూషణ, శ్రీధర్‌, తిప్పేస్వామి, శివకుమార్‌, గిరిస్వామి, వెంకటేశులు, రామాంజినేయులు, ధనుంజయ, రాజశేఖర్‌, ఆంజినేయులు, గోపాల్‌ పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు ఉన్నం హనుమంతరాయచౌదరి ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, పాపంపల్లి రామాంజనేయులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి క రణం రామ్మోహనచౌదరి, ఆర్జీ శివశంకర్‌, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అమిలినేని లక్ష్మినారాయణచౌదరి, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీ రమేష్‌లతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గౌరవసభ నిర్వ హించి, ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించారు. ఉన్నం మాట్లాడుతూ సీ ఎం జగనరెడ్డి ప్రజలను నమ్మించి వంచిస్తున్నారని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో రాషా్ట్రన్ని అంధకారంలోకి నెట్టేసి దోచుకునే ప్రయత్నం చేస్తున్నార న్నారు. ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని వివరించారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు కరపత్రాలను అందజేస్తూ ప్రభుత్వవైఖరిని ఎండగట్టారు. కార్యక్రమంలో సర్పంచు లక్ష్మణమూర్తి, నాయకులు శ్రీరాములు, త లారి ఎర్రిస్వామి, ఆవుల తిప్పేస్వామి, డీకే రామాంజనేయులు, కొల్లాపురప్ప, నా రాయణ, గోళ్ల రాము, రాఘవేంద్రబాబు, వెలుగు లోకేష్‌, వన్నూరప్ప, గంగాధర్‌, చంద్రప్ప, మోహన పాల్గొన్నారు.


Updated Date - 2021-12-25T06:26:20+05:30 IST