నకిలీ పురుగు మందుల దందా

ABN , First Publish Date - 2021-11-08T06:46:05+05:30 IST

మండలంలోని పలు ఫర్టిలైజర్స్‌ దుకాణా ల్లో నకిలీ పురుగు మందుల దందా సాగుతోంది. కొందరు క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువుల అమ్మకందారులు నాణ్యతలేని మందుల ను రైతులకు అంటగట్టి పబ్బంగడుపుకుంటున్నారు.

నకిలీ పురుగు మందుల దందా
తెగులు సోకిన వరి పంట

నిలువునా మోసపోతున్న రైతులు


బొమ్మనహాళ్‌, నవంబరు 7: మండలంలోని పలు ఫర్టిలైజర్స్‌ దుకాణా ల్లో నకిలీ పురుగు మందుల దందా సాగుతోంది. కొందరు క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువుల అమ్మకందారులు నాణ్యతలేని మందుల ను రైతులకు అంటగట్టి పబ్బంగడుపుకుంటున్నారు. నకిలీ మందులను అ ధిక ధరలకు విక్రయిస్తూ కొందరు డీలర్లు రైతులను ముంచుతున్నారు. మండలంలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరి, మిరప, పత్తి, దానిమ్మ వంటి మేలు రకం పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా పంటలకు తె గుళ్ల ఉధృతి అధికమైంది. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని ప్ర ముఖ కంపెనీలకు చెందిన మందుల పేరుతో కాంబినేషన బయో మందులను ఇస్తూ రైతుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్రిమిసంహారక మందుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నా రు. కొందరు డీలర్ల వద్ద వున్న నకిలీ మందులపై అధికారులు తనిఖీలు చే యకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. డీలర్లే ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. గుంటూరు నుంచి నకిలీ మందులు మండలానికి సరఫరా అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరి పంటకు అగ్గి తెగులు, సుడిదోమ ఎక్కువగా ఆశించింది.


మార్కెట్లో టెక్సిలిన లీటరు దాదాపు రూ. 11 వేలు వుండగా, ఇక్కడ డీలర్లు రూ.14 వేలకు పైగా విక్రయింస్తున్నారు. అందులోనూ అప్పుకు మరింత చక్రవడ్డీ వేసి వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. చెస్‌ అనే మందు రకం రూ.4 వేలు వుండగా, రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేయడమే కాక... కాంబినేషన పేరుతో తక్కువ ధరలు వున్న మందులను రైతుల నెత్తిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. భీమ్‌, సివిక్‌, అప్లాడ్‌, బావిస్టాన, పొక్లైన, రిజెంట్‌ తదితర మందులను కూ డా కాంబినేషన పేరుతో తక్కువ ధరలకు తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డీలర్ల మాయమాటలు నమ్మి పైరుకు పిచికారీ చేసినా తెగుళ్లు మాత్రం అదుపు కావడం లేదని మిరప, పత్తి, వరి, దానిమ్మ రైతులు వా పోతున్నారు. వ్యవసాయ, విజిలెన్స శాఖల అధికారులు తనిఖీ చేయకపోవడంతో నకిలీ దందా కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. మండలంలో ప్ర తి యేటా ఎంతోమంది రైతులు మోసపోతూనే వున్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల పట్ల చట్టాలు వున్నా అవేమీ పట్టనట్లుగా డీలర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి బొమ్మనహాళ్‌ మండలం వంద కిలోమీటర్లకు పైగా వుండటంతో తనిఖీ అధికారులు ఇక్కడకు వచ్చేందుకు జంకుతున్నారని తెలుస్తోంది. వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతుల కు తెగుళ్లపై అవగాహన కల్పించి, ఏ మందులు పిచికారి చేయాలో తెలియజేయడం లేదు. దీంతో రైతులు ఫర్టిలైజర్స్‌ దుకాణాల యజమాని చెప్పి న మందులను తీసుకెళ్లడంతో తెగుళ్లు అదుపు కాకపోగా.. చివరకు రైతుల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. 


నకిలీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు:

అహ్మద్‌ బాషా, ఏవో, బొమ్మనహాళ్‌ 

రైతులకు నకిలీ మందులను అంటగట్టి మోసగిస్తే చర్యలు తప్పవు. ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై తరచూ తనిఖీలు జరుగుతున్నాయి. దోమపోటు తదితర తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆర్‌బీకేలను సంప్రదిస్తే వ్యవసాయ శాఖ సిబ్బంది తెగుళ్ల నివారణపై అవగాహన కల్పిస్తారు. 


Updated Date - 2021-11-08T06:46:05+05:30 IST