చెట్లు నరకడం పిరికిపంద చర్య
ABN , First Publish Date - 2021-05-05T06:34:19+05:30 IST
మండలంలో టీడీపీ నాయకుల ఆర్థికమూలాలు దెబ్బతీసే విధంగా చెట్లు నరకడం, గడ్డివాములు కాల్చ డం వంటివి పిరికిపంద చర్య అ ని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ రాజు పేర్కొన్నా రు.

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
పుట్లూరు, మే4: మండలంలో టీడీపీ నాయకుల ఆర్థికమూలాలు దెబ్బతీసే విధంగా చెట్లు నరకడం, గడ్డివాములు కాల్చ డం వంటివి పిరికిపంద చర్య అ ని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ రాజు పేర్కొన్నా రు. ఈ సందర్భంగా మంగళవారం గరుగుచింతలపల్లి గ్రా మంలో టీడీపీ నాయకుడు వెం కట నారాయణరెడ్డికి చెందిన నరికివేసిన చీనీచెట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వం వచ్చాక మండలంలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. చెట్లు నరికి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం దారుణమన్నారు. పోలీసులు అందరికి ఒకే న్యాయం చేయాలన్నారు. ఈ సంఘటనలపై త్వరలో జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు. అనంతరం బాధిత రైతును పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల కన్వీనర్ బాల రంగయ్య, సుదర్శన్‌నాయుడు, విజయ్‌కుమార్‌నాయుడు, ఆదినారాయణరెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, గోవర్ధన్‌రాజు, రామాంజనేయులు, చంద్ర, నారాయణరెడ్డి, వెంకటనారాయణ, రాము తదితరులు ఉన్నారు.