70 మామిడి మొక్కల నరికివేత

ABN , First Publish Date - 2021-12-07T06:07:51+05:30 IST

మండల పరిధిలోని మలమీదపల్లి గ్రామంలో అల్లాబ క్షుకు చెందిన 70 మామిడి మొక్కలను అదే గ్రామానికి చెందిన కొందరు నరికి వేసినట్లు బాధిత రైతు అల్లాబక్షు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

70 మామిడి మొక్కల నరికివేత

గాండ్లపెంట,  డిసెంబరు 6: మండల పరిధిలోని మలమీదపల్లి గ్రామంలో అల్లాబ క్షుకు చెందిన 70 మామిడి మొక్కలను అదే గ్రామానికి చెందిన కొందరు నరికి వేసినట్లు బాధిత రైతు అల్లాబక్షు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు మేరకు వివ రాలు ఇలా ఉన్నాయి. రైతు అల్లాబక్షు తన కున్న ఎకరాన్నర పొలంలో మామిడి మొ క్కలను సాగుచేశాడు. గత నాలుగు సంవ త్సరాలుగా మామిడిమొక్కలను పెంచుతూ ఉన్నాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన నాగేశ్వర రా వు, అతని కుమారుడు జయరాం, రామక్రిష్ణ కలసి 70 మామిడి మొక్కలను నరికి వేశా రని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అల్లాబక్షు, నాగేశ్వరరావు ఇరువురు ఈ భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అల్లాబక్షు సాగుచేసిన మామిడిచెట్లను నాగేశ్వరరావు అతని కుమారులు నరికివేసినట్లు బాధిత రైతు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ మల్లికా ర్జునరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-07T06:07:51+05:30 IST