నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు కఠినతరం

ABN , First Publish Date - 2021-05-13T06:12:05+05:30 IST

నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు మరిం త కఠినంగా మారాయి.

నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు కఠినతరం
రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి జరిమానా వేస్తున్న పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది

అనంతపురం క్రైం, మే12 : నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు మరిం త కఠినంగా మారాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తరు వాత కర్ఫ్యూ ఆంక్షలను నగర పోలీసులు పగడ్బందీగా అమలు చేయడంతో పలు దుకాణాలు, వ్యాపార సముదాయాలు  మూతప డ్డాయి. కొందరు దుకాణాదారులు యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తుం డటంతో పోలీసులు వాటిని మూసివేయించా.  కర్ఫ్యూ సడలింపు స మయంలో మాత్రమే నగరంలో జనాల రద్దీ, వాహనాల రద్దీ అధిక మవుతోంది. కనీసం ట్రాఫిక్‌ నియంత్రణ కూడా లేకపోవడంతో ఎక్క డిక్కడ గంటల తరబడి రోడ్లపై నగర ప్రజలు, వాహనాచోదకులు ఎండలోనే  నీరీక్షించాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తరు వాత పోలీసుల రంగ ప్రవేశంతో నగర వీదులు, ప్రధాన రహాదారు లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.  కర్ఫ్యూ ఆంక్షలు అతిక్రమించి అనవసరంగా బయట తిరిగిన వాహనాచోదకులపై నగర పోలీసులు జరిమానాలు విధించడంతో పాటు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. అంతేకా కుండా డ్రోన కెమెరాలచే నిఘా ఉంచి చర్యలు చేపడుతున్నారు.  


Updated Date - 2021-05-13T06:12:05+05:30 IST