బాధితులకు ముమ్మరంగా పరిహారం

ABN , First Publish Date - 2021-11-26T06:01:27+05:30 IST

జిల్లాలో వర్ష బాధితులకు ప రిహారం పంపి ణీ కార్యక్రమా న్ని ముమ్మరం గా చేపట్టినట్టు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు వివరించారు.

బాధితులకు ముమ్మరంగా పరిహారం

సీఎ్‌సకు వివరించిన కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్ష బాధితులకు ప రిహారం పంపి ణీ కార్యక్రమా న్ని ముమ్మరం గా చేపట్టినట్టు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు వివరించారు.  గురువారం విజయవాడ నుంచి కలెక్టర్‌, జేసీలతో సీఎస్‌ వీడి యోకాన్ఫరెన్స నిర్వహించారు. వరద సహాయక చర్యలపై కలెక్టర్‌తో ఆరా తీశారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీలు నిశాంతకుమార్‌, డాక్టర్‌ సిరి, నిశాంతి ఈకార్య క్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన వరద సహాయక చర్యలపై కలెక్టర్‌ సీఎ్‌సకు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికగా సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. వీసీ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వతంగా తాగునీటి పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పంచా యతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల పనులను వెంటనే చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. పశుంసవర్థక శాఖ పరిధిలో మృతి చెందిన పశువులు, గొర్రెలు,మేకల వివరాలపై సర్వే చేసి ప్ర భుత్వ నిబంధనల మేరకు పరిహారం పంపిణీకి అవసర మైన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడికక్కడ వైద్య శిబి రాలు ఏర్పాటు  చేసి పశువులకు వ్యాక్సినేషన , మందులు పంపిణీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూం, 104 కాల్‌ నెంటర్‌కు వచ్చిన ఫి ర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఓ ప్రేమచంద్‌, జేడీఏ చంద్రానాయక్‌, ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T06:01:27+05:30 IST