మల్చింగ్‌ పద్ధతిలో పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-07-19T07:12:20+05:30 IST

మల్చింగ్‌ పద్ధతిలో పంటలు సాగు చేస్తే భూమిలో తేమశాతం ఎక్కువ రోజులు ఉండటంతో పాటు కలుపు ను నివారించవచ్చుని రాష్ట్ర రైతుసాఽధికారిక సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మల్చింగ్‌ పద్ధతిలో పంటలు సాగు చేయాలి
మల్చింగ్‌ విధానాన్ని పరిశీలిస్తున్న విజయకుమార్‌

 రాష్ట్ర  రైతు సాఽధికారిక సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌


ధర్మవరంరూరల్‌, జూన్‌18: మల్చింగ్‌ పద్ధతిలో పంటలు సాగు చేస్తే భూమిలో తేమశాతం ఎక్కువ రోజులు ఉండటంతో పాటు కలుపు ను నివారించవచ్చుని రాష్ట్ర రైతుసాఽధికారిక సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలపరిధిలోని చిగిచెర్ల గ్రామంలో  మల్చిం గ్‌ పద్ధతిలో సాగుచేసిన పంటలను జిల్లా డీపీఎం లక్ష్మానాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో పంటలు సాగుచేసే అధిక దిగుబడులు వచ్చి భూమి సారవంతంగా ఉంటుందన్నారు. ఈ విధానంతో పంటలు సాగుచేస్తే ఒక పంట నష్టం వచ్చిన మరోక్కపంట రైతుకు ఆదాయాన్ని చేకూరుతుం దన్నారు. ఈ మల్చింగ్‌తో భూమిలో తేమశాతం కూడా అధిక రోజులు ఉంటుంది. అదేవిధంగా పంటలసాగుకు ఘన, ద్రవ, జీవామృతం వేయడం వల్ల భూములు సారవంతం పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు దోహదపడుతున్నారు. రైతులు ఖరీఫ్‌లో సాగుచేసే వేరుశ నగ, కంది, నవధాన్యలు పంటలను ప్రకృతి సేద్యంతో సాగుచేసి ఆరోగ్య కరమైన పంటలను పండించుకోని భూములు సారవంతంగా ఉంటా యని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీ భానుమతి, కన్సెల్టెంట్‌ సురేంద్రరెడ్డి, ఏఓ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా యాంకర్‌ రవిచంద్ర, ఎస్‌డీఏ చెన్నమ్మ, ఐబీఎస్‌డీఏ వేణి, ఐసీఆర్‌పీలు రామాంజినేయులు, ఆనంద్‌, రమణ, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-19T07:12:20+05:30 IST