క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-10-28T05:52:01+05:30 IST
మండలపరిధిలోని బడేనాయక్ తండా వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం నిమిత్తం ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సీఈఓ శివారెడ్డితో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు.

పుట్టపర్తిరూరల్, అక్టోబరు 27: మండలపరిధిలోని బడేనాయక్ తండా వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం నిమిత్తం ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సీఈఓ శివారెడ్డితో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంలో క్రీడాభివృద్ధి కోసం నూతనంగా స్డేడియం నిర్మించాలని ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారన్నారు. దీంతో గోనే నాయక్ తండా సమీపంలో 19 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్‌చైర్మన్ మాతంగి తిప్పన్న, ఎంపీపీ ఏవీరమణారెడ్డి, సర్వేయర్ శేష సాయికోటి, నాయకులు కొండారెడి ్డ గెనిగాని గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.