పోలీసుల అదుపులో క్రికెట్‌ బుకీలు

ABN , First Publish Date - 2021-10-28T06:02:06+05:30 IST

పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో క్రికెట్‌ బుకీలు

రాయదుర్గం, అక్టోబరు 27: పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 3.90 లక్షలు వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గుమ్మఘట్ట మండలం జాలివంక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సురేంద్రనాథ్‌ రెడ్డి, రాయదుర్గం పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన వేటూరు శ్రీనివాసులు, కురుబ బసవరాజులను అదుపులోకి తీసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి నగదు ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. పైగా అదుపులోకి తీసుకున్న వారిపై కేసు లేకుండా విడిపించుకునేందుకు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్న ట్లు సమాచారం. దీనిపై సీఐ సురే్‌షబాబును వివరణ కోరగా క్రికెట్‌ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-28T06:02:06+05:30 IST