27 నుంచి సీపీఎం జిల్లా మహాసభలు

ABN , First Publish Date - 2021-10-20T06:04:41+05:30 IST

తాడిపత్రిలో ఈనె ల 27వ తేదీ నుం చి రెండ్రోజులపా టు సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పా ర్టీ జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ మంగళవారం తెలిపారు.

27 నుంచి సీపీఎం జిల్లా మహాసభలు
మహాసభల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

 అనంతపురం టౌన, అక్టోబరు 19: తాడిపత్రిలో ఈనె ల 27వ తేదీ నుం చి రెండ్రోజులపా టు సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పా ర్టీ జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ మంగళవారం తెలిపారు. స్థానిక గణేనాయక్‌ భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ.. మహాసభల్లో భాగంగా 27న ఉదయం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సభకు సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు హాజరవుతారన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పార్టీ శాఖల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. గడిచిన మూడేళ్లలో సీపీఎం చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాలను మహాసభల్లో సమీక్షించుకుని, భవిష్యత కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ప్రజాసమస్యలపై రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. ఈ క్రమంలో రైతులు, ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి 27, 28 తేదీల్లో నిర్వహించే మహాసభల్లో కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, నాగేంద్రకుమార్‌, ఆర్‌వీ నాయుడు, ఆఫీస్‌ బేరర్‌ సురేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T06:04:41+05:30 IST