సంతపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2021-05-21T06:18:26+05:30 IST

వారపు సంతలపై కరోనా ప్రభావం చూపుతోంది. కర్ఫ్యూ అమలులో ఉండడంతో కూరగాయల వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే అమ్మకాలకు వీలు కల్పించారు.

సంతపై కరోనా ప్రభావం
మడకశిర వారపు సంత

కొనుగోలుదారులు లేక కూరగాయల వ్యాపారులు విలవిల 

మడకశిర అర్బన్‌, మే 20 : వారపు సంతలపై కరోనా ప్రభావం చూపుతోంది. కర్ఫ్యూ అమలులో ఉండడంతో కూరగాయల వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే అమ్మకాలకు వీలు కల్పించారు. సమయం తక్కువగా ఉండడం, కొవిడ్‌ నిబంధనల కారణంగా సంతకు వచ్చేందుకు ప్రజలు కూడా మొగ్గుచూపడం లేదు.  గురువారం వారపు సంత నేపథ్యంలో  వ్యాపారులు వేల రూపాయలు ఖర్చు చేసి ఇతర ప్రాంతాల్లో ఆటోలు, టెంపోలలో కూరగాయలు తెచ్చుకొని విక్రయాలకు ఉంచారు. అయితే వ్యాపారాలు లేక వారు ఇబ్బందులు పడ్డారు. కనీసం సంతకు తెచ్చిన కొద్దిపాటి కూరగాయల్లో సగం కూడా అమ్ముడుపో కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆ వ్యాపారులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-21T06:18:26+05:30 IST