రాచానపల్లి సొసైటీ చుట్టూ సహకార రాజకీయం

ABN , First Publish Date - 2021-06-21T06:20:36+05:30 IST

ఒక్క సొసైటీ కోసం 115 సంఘాలకు సంబంధించిన కమిటీల నియా మకంలో ఆలస్యమవుతోంది. అనంతపురం రూరల్‌ పరిధి లోని రాచానపల్లి సొసైటీపై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్టుపడుతుండటంతో సహకార శాఖ అ ధికారుల ప్రతిపా దనలు పంపడం మరింత జాప్యమవుతోంది

రాచానపల్లి సొసైటీ చుట్టూ సహకార రాజకీయం
రాచానపల్లి సొసైటీ కార్యాలయం

44 సంఘాల పాత కమిటీలకే ఆమోదం

71 సొసైటీల ప్రతిపాదనలపై తర్జనభర్జన

పంతాలతో ఆలస్యమవుతున్న కమిటీల నియామకం


అనంతపురం క్లాక్‌టవర్‌, జూన్‌ 20: ఒక్క సొసైటీ కోసం 115 సంఘాలకు సంబంధించిన కమిటీల నియా మకంలో ఆలస్యమవుతోంది. అనంతపురం రూరల్‌ పరిధి లోని రాచానపల్లి సొసైటీపై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్టుపడుతుండటంతో సహకార శాఖ అ ధికారుల ప్రతిపా దనలు పంపడం మరింత జాప్యమవుతోంది. రాచానపల్లి సొసైటీ త్రిసభ్యకమిటీ కోసం పోటీలో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యేకు అనుకూలంగా లేకపోవడంతో వేరేవాళ్లకు చైర్మన్‌గా అవకాశం కల్పించేందుకు ఆయన నిశ్చయించుకున్నట్లు సమాచా రం. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఒకపేరు, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించడంతో సహకార శాఖ అధికారులు తలలు బాదుకుంటున్నారు. ఈనేపథ్యంలో సొసైటీ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జి మం త్రితోపాటు జిల్లా మంత్రి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వరకు రాచానపల్లి సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన రామసుబ్బారెడ్డి పేరును అనంతపురం ఎమ్మెల్యే ప్రతిపాదించగా, నరసింహారెడ్డి పేరును రాప్తాడు ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఈ సొసైటీ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల పదవులు సిఫారసులు ఉన్న వారికే దక్కుతున్నాయి. ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ప్రజాప్రతి నిఽధులు సూచించిన పేర్లను ఆమోదిస్తున్నారు. జిల్లా సహకార శాఖ అధికారులు సొసైటీలకు త్రిసభ్యకమిటీలు (నాన్‌ అఫీషియల్‌) నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 118 సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో పి యాలేరు కోర్టుకేసు, పుట్టపర్తి అఫి షియల్‌ పీఐసీ, ఆమిద్యాలలోకి కౌకుంట్ల, రాకెట్ల సొసైటీలు విలీనమయ్యాయి. ఈ మూడు మినహా మిగిలిన 115 సొసైటీలకు నాన్‌ అఫిషియల్‌ త్రిసభ్య కమిటీలు నియమించాల్సి ఉంది. వీటిలో 44 సొసైటీలకు ఇది వరకు పనిచేసిన త్రిసభ్య కమిటీలకే ఆమోదం తెలిపారు. మరో 71 సొసైటీలకు నాన్‌ అఫిషియల్‌ త్రిసభ్య కమిటీలు నియమించాల్సి ఉంది. వీటిలో రాచనపల్లి మినహా మిగిలిన 70 సొసైటీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సహకార శాఖ ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపారు. అయితే రాచానపల్లి సొసైటీ వస్తేనే మిగిలిన 70కి కూడా ఒకేదఫాలో ఆమోదింపచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకే ప్రజాప్రతినిధి రెండు పే ర్లు సూచించడం, ఎమ్మెల్యే ఒక పేరు, ఎంపీ మరో పేరు సూచించడం ఇలా పేర్లు పునరావృతం కావడంతోనే త్రిసభ్య కమిటీల ని యామకం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. సొసైటీలు పూర్తి అయితే ఏడీసీసీ బ్యాంకు, డీసీఎంఎస్‌ పాలకవర్గాలను నియమిం చే అవకాశం ఉంది. దీనిపై డీసీఓ సుబ్బారావు స్పందిస్తూ త్వరలో రాచానపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి, మిగిలిన 70 సహకారసంఘాల త్రిసభ్య కమిటీల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. సొసైటీల త్రిసభ్య కమిటీల నియామకం అనంతరం ఏడీసీసీ బ్యాంకు, డీసీఎంఎ్‌సల పాలకవర్గాలను నియమించే ందుకు రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారులకు పేర్లను ప్రతిపాదిస్తామన్నారు.


Updated Date - 2021-06-21T06:20:36+05:30 IST