కంటైనర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-12T05:45:47+05:30 IST

కియా కార్లను తరలించే కంటైనర్‌ డ్రైవర్‌ సద్దాం అన్సారి(30)అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

కంటైనర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

పెనుకొండ రూరల్‌, జూలై 11: కియా కార్లను తరలించే కంటైనర్‌ డ్రైవర్‌ సద్దాం అన్సారి(30)అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపిన వివరాల మేరకు జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సద్దాంఅన్సారి కియా కంపెనీలో తయారయ్యే విడిభాగాలు, కార్లను తరలించే ట్రాన్సపోర్ట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ నుంచి వారం రోజుల క్రితం వచ్చిన సద్దాం అన్సారి అమ్మవారిపల్లి సమీపంలోని కంటైనర్‌ పార్కింగ్‌ స్థలంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం అమ్మవారిపల్లి సమీపంలో హైవోల్టేజి విద్యుత స్థంభానికి ఉరికి వేలాడుతూ కనిపించడంతతో సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతన్ని ఎవరైనా హత్యచేసి ఉంటారా లేక తనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 


Updated Date - 2021-07-12T05:45:47+05:30 IST