వినియోగదారులూ... హక్కులు తెలుసుకోండి

ABN , First Publish Date - 2021-12-25T05:51:59+05:30 IST

విని యోగదారుల చట్టం ద్వారా సంక్రమించిన హక్కుల గురించి ప్రతి పౌరుడూ అవగాహన కలిగి ఉండాలని జేసీ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు.

వినియోగదారులూ... హక్కులు తెలుసుకోండి
మాట్లాడుతున్న జేసీ నిశాంతకుమార్‌

జేసీ నిశాంతకుమార్‌


అనంతపురం,డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): విని యోగదారుల చట్టం ద్వారా సంక్రమించిన హక్కుల గురించి ప్రతి పౌరుడూ అవగాహన కలిగి ఉండాలని జేసీ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విని యోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి హాజరైన జేసీ నిశాంతకుమార్‌ మాట్లాడుతూ... విని యోగదారుల చట్టంలో అంశాలను అమలుచేస్తూ.. పారద ర్శకంగా తెలియజేయాలన్నారు. ఆహార నియంత్రణశాఖ, తూనికలు, కొలతల శాఖ, ఔషధ నియంత్రణ తదితర శా ఖలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి దుకాణంలో ఫోన నెంబర్లు అందుబాటులో ఉండాలన్నా రు. ప్రస్తుతం వినియోగదారులు వస్తు సేవలు పొందే క్ర మం లో తమ హక్కులకు భంగం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019లో వినియోగదారుల హక్కుల కోసం నూతన చట్టాన్ని తీసుకొచ్చాయన్నారు. దీంతో ఆన లైనలో అమ్మకాలు జరిపే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన లాంటి సం స్థలూ ఈ చట్టం పరిధిలోకి వచ్చాయన్నారు. వినియోగదా రులహక్కులను కాపాడేందుకు ప్రత్యేక కోర్టులు, ఫోరంలు ఇదివరకే ఏర్పాటు చేసుకున్నామన్నారు.  ప్రజలు చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకొని నాణ్యమైన సేవలు పొందాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి చెక్కు లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ ఓ రఘురామిరెడ్డి, సివిల్‌ సప్లైస్‌ డీఎం వెంకటరా ముడు, లీగల్‌ మెట్రాలజీ ఏసీ స్వామి, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఏసీ స్వర్ణలత, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ తస్లీమ్‌, డీసీఐసీ సభ్యులు నభీరసూల్‌, రవీందర్‌రెడ్డి, క్యాప్కో అధ్యక్షులు యల్లంగారి మోహన, క్యాప్కో సెక్రటరీ సురే్‌షకుమార్‌, వివిధ పాఠశా లల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-25T05:51:59+05:30 IST