కర్ణాటక మద్యం బాటిళ్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-02-01T06:35:35+05:30 IST

మండలంలోని చిన్నముష్టూరు గ్రామ శివారులో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా ఆదివారం ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.

కర్ణాటక మద్యం బాటిళ్లు పట్టివేత
ఉరవకొండలో స్వాధీనం చేసుకున్న మద్యంతో పోలీసులు

ఉరవకొండ, జనవరి 31: మండలంలోని చిన్నముష్టూరు గ్రామ శివారులో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా ఆదివారం ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు. తెల్లవారుజామున అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 960 మద్యం పాకెట్లు, ఆటో, ద్విచ క్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఏ ఎ్‌సఐ వీరాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. 


విడపనకల్లు : మండలంలోని కరకముక్కల గ్రామం వద్ద సెబ్‌ అధికారులు 192 మద్యం బాటిళ్లు, ద్విచక్ర వాహనాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లుకు చెందిన గుణక నాగేంద్ర బళ్లారి నుంచి ద్విచక్ర వాహనంలో కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ పట్టుపబడ్డాడని ఎక్సైజ్‌  ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. దాడుల్లో సెబ్‌ అధికారులు రియాజ్‌ అహమ్మద్‌, మౌలా లి, వీరారెడ్డి, రామకృష్ణ, శైలజ, విశ్వనాథ పాల్గొన్నారు.


యాడికి: మండలంలోని భోగాలకట్ట గ్రామం వద్ద అక్రమం గా తరలిస్తున్న 225 మద్యం బాటిళ్లను సీజ్‌ చేసినట్లు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ రామయ్య ఆదివారం తెలిపారు. తెల్లవారుజామున పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన చిన్నరాముడు, వైటీ చెరువుకు చెందిన గోపాల్‌, గుత్తికి చెందిన బెస్త పవనలు మద్యం బాటిళ్లను తరలిస్తుండగా దాడిచేసి పట్టుకొన్నామన్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా, బెస్త పవనలో పరారీలో ఉన్నట్లు తెలిపారు.


బెళుగుప్ప: బెళుగుప్ప, దుద్దేకుంట, కాలువపల్లిలో ఆదివారం ఎక్సైజ్‌ అధికారులు నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసినట్లు కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ సీఐ హరికృష్ణ తెలిపారు.  900 లీటర్ల ఊటను ధ్వంసం చేశారన్నారు. గ్రామాల్లో నారా తయారీ, కర్ణాటక మద్యం విక్రయిస్తుంటే సెల్‌ 9989819191 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు.


వజ్రకరూరు : మండలంలోని పీసీ ప్యాపిలి గ్రామంలో ఆదివారం వెయ్యి లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పవనకుమార్‌,రాజు, ఆంజనేయులు, పాపా నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T06:35:35+05:30 IST