కేజీబీవీని తనిఖీ చేసిన సమగ్ర శిక్ష పీఓ

ABN , First Publish Date - 2021-08-27T05:51:37+05:30 IST

స్థానిక కేజీబీవీని సమగ్ర శిక్ష పీఓ తిలక్‌ విద్యాసాగర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కేజీబీవీని తనిఖీ చేసిన సమగ్ర శిక్ష పీఓ

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 26: స్థానిక కేజీబీవీని సమగ్ర శిక్ష పీఓ తిలక్‌ విద్యాసాగర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశా ల ఆవరణలో నిర్మిస్తున్న నాడు-నేడు పనుల నాణ్యతను పరి శీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడా రు. కష్టప డి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని కోరారు. అనంతరం విద్యా ర్థుల తో వివిధ సబ్జెక్టుల వారిగా సమీక్షించారు. ఆ తర్వాత ఎస్‌ఓ భారతితో సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు.  అనంతరం ఎంఆర్‌సీని తనిఖీ చేసి, రికార్డులు పరిశీలిం చారు. వీటితో పాటు మానసిక వికలాంగ పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ మా నసిక వికలాంగుల విద్యార్థులకు అందుతున్న సేవల ను ఆరాతీశారు. పీఓతో పాటు ఎంఈఓ చెన్నక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-27T05:51:37+05:30 IST