కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-06-21T06:40:22+05:30 IST

కొవిడ్‌ కారణంగా చనిపోయిన వారి విషయంలో నిబంధనలు సవరించి కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డి మాండ్‌చేశారు.

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ
జయరాజ్‌ భార్యను పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

తాడిపత్రి, జూన 20: కొవిడ్‌ కారణంగా చనిపోయిన వారి విషయంలో నిబంధనలు సవరించి కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డి మాండ్‌చేశారు. మండలంలోని చుక్కలూరు క్రాస్‌ ఎంపీయూపీ స్కూల్‌లో స్కూల్‌అసిస్టెంట్‌గా పనిచేసిన జయరాజ్‌ కరోనాతో మృతిచెందడంతో బాధిత కుటుంబసభ్యులను ఆదివా రం ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ జయరాజు భార్య తీవ్ర అనారోగ్యం తో మంచానికే పరిమితమైందన్నారు. కుమారుడు మానసిక దివ్యాంగుడని, వివాహమైన కుమార్తె మాత్రమే ఆసరాగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శిని క లిసి కారుణ్య నియామకాలు జరపాలని వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. పరామర్శించి న వారిలో ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్‌ సాంబశివారెడ్డి, తాడిపత్రి నాయకులు శివచంద్ర, ప్ర సాద్‌, కిరణ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - 2021-06-21T06:40:22+05:30 IST