విధులకు వస్తే సమాచారం ఎందుకుండదు?

ABN , First Publish Date - 2021-08-27T06:01:14+05:30 IST

‘రోజు విధులకు వస్తుంటే మీ వద్ద సమగ్రమైన సమాచారం ఎందుకులేదు’ అంటూ సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీసెల్వరాజన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులకు వస్తే సమాచారం ఎందుకుండదు?

సచివాలయ సిబ్బందిని ప్రశ్నించిన కలెక్టర్‌

సెప్టెంబరు ఆఖరులోగా అన్ని నిర్మాణ పనులు పూర్తి కావాలి

అర్హులందరికీ పథకాలు అందించాలి

కొత్తచెరువు, ఆగస్టు 26: ‘రోజు విధులకు వస్తుంటే మీ వద్ద సమగ్రమైన సమాచారం ఎందుకులేదు’ అంటూ సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీసెల్వరాజన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మండలంలో ని కొడపగానిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం, హెల్త్‌సెంటర్‌, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్‌కు సర్పంచ అలివేలమ్మ, ఆర్డీఓ వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అ నంతరం జగనన్న ఇళ్లనిర్మాణాలు,  సచివాలయాలు, హెల్త్‌, ఆర్‌బీకే కేంద్రాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబరు ఆఖరిలోగా ఈ  పనులన్నీ పూర్తి చేయాల ని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. జగ నన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఎంత వరకు పూర్తి చేశా రని తహసీల్దార్‌, ఎంపీడీఓ, హౌ సింగ్‌ అధికారులతో ఆరా తీశారు.  మండల వ్యాప్తంగా 1700 ఇళ్లు మంజూరుకాగా ఇప్పటి వరకు 1400 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామ ని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు కాలనీల్లో నీరు, విద్యుత సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కొరత తీ వ్రంగా ఉందని, దీంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావటం లేదని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అనంతరం సచివాల యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి రెండేళ్లు అవుతోందని ఉద్యోగులంతా వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో సక్రమంగా మాట్లాడి వారి సమస్యలను  పరిష్కరించాలని ఆదేశించారు. విద్యాదీవెన, కాపునే స్తం, వైఎ్‌సఆర్‌ చేయూత, అమ్మఒడి, పింఛనలు తదితర పథకాలను అర్హులకు అందే లా చూడాలన్నారు. డ్రిప్‌ పరికరాలు అందించాలని వ్యవసాయ సలహాసంఘం అధ్యక్షుడు శ్యాం సుందర్‌రెడ్డి, ఆవుటాల రమణారెడ్డి కలెక్టర్‌ ను కోరారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి  ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూడాలని,  సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసేవిధంగా సిబ్బంది పనితీరు మెరుగుపరచా లని సూచించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్‌ కేశ వనా యుడు, ఇనచార్జ్‌ తహసీల్దార్‌ వెంకటరెడ్డి, ఎంీ పడీఓ మక్బూల్‌బాషా, డీఈ గంగాధర్‌, జే ఈ లు నాగరాజు, నాగ దివ్య, ఆర్‌ఐవలీ, వీఆర్వో లు, రవిశేఖర్‌రెడ్డి, కాటమయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:01:14+05:30 IST