విద్యుత ఆదాతో జీవన ప్రమాణాలు మెరుగు

ABN , First Publish Date - 2021-12-15T06:02:37+05:30 IST

విద్యుత ఆదా చేసుకోవడం ద్వారా మనిషి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

విద్యుత ఆదాతో జీవన ప్రమాణాలు మెరుగు

కలెక్టర్‌ నాగలక్ష్మి..

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం

అనంతపురంరూరల్‌, డిసెంబరు14: విద్యుత ఆదా చేసుకోవడం ద్వారా మనిషి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా విద్యుత శా ఖ ఆధ్వర్యంలో విద్యుత పొదుపుపై నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యుత శాఖ ఎస్‌ఈ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌, జేసీ నిశాంతకుమార్‌, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ చంద్రానాయక్‌, నగర కమిషనర్‌ మూర్తి హాజరయ్యారు. ముందుగా కలెక్టరేట్‌ ఆవరణలో జెండా ఊపి, ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. ర్యాలీ పవర్‌ ఆఫీస్‌ మీదుగా ఐరన బ్రిడ్జి, సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌ వరకు సాగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంధనం, విద్యుత ఆదాలాంటి అంశాలు జీవన విధానంలో భాగం కావాలన్నారు. ఒకప్పుడు రకరకాల ఇంధనాలు దైనందిన జీవితంలో కనిపించేవన్నారు. ఇప్పుడు విద్యుత అనే ఏకైక ఇంధనంతో నడిచే దిశగా ప్రపంచం నడుస్తోందన్నారు.  జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయనీ, రైతులు విద్యుత ఆదా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు తమ కరెంటు బిల్లులను పరిశీలించి, ఏయే నెలల్లో తమ వాడకం ఎక్కువగా ఉందో గుర్తించి.. వినియోగం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యుత శాఖ టెక్నికల్‌ ఈఈ రాజశేఖర్‌, అనంతపురం డివిజన ఈఈ సురేంద్ర, డీఈఈలు, ఏఈఈలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-12-15T06:02:37+05:30 IST