ఆగస్టు 15 వేడుకలకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-10T06:53:00+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ఆయా శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు.

ఆగస్టు 15 వేడుకలకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్‌

అనంతపురం, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ఆయా శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రొటోకాల్‌ ఏర్పాట్లు, సాంస్కృతిక శకటాల ప్రదర్శన, స్టాల్స్‌ ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న లబ్ధిని తెలియజేసేలా వినూత్న రీతిలో శకటాలను రూపొందించాలన్నారు. వేడుకలు నిర్వహించే పోలీసు పరేడ్‌ మైదానంలో ప్రధాన వేదిక, జాతీయ జెండాను ఎగురవేయడం తదితర ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. తక్కువ మంది పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమా లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలలో పథకాలను ప్రజలకు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులను ఎంపిక చేసి జాబితాను బు ధవారంలోగా పంపించాలన్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని ప్రతిబింబిస్తూ స్టాల్స్‌ ఏర్పా టు చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవంలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం చాలా ముఖ్యమన్నా రు. ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శనలో తక్కువ మంది పాల్గొనేలా చూడాలన్నారు. ఆయా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల చిన్నారులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీలు డా. సిరి, గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, డీఆర్వో గాయత్రీదేవి, సీపీఓ ప్రేమచంద్ర, ఆర్డీఓ మధుసూదన, మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ నరసిం హారెడ్డి, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీటీసీ శివరాంప్రసాద్‌ పాల్గొన్నారు.


డీఆర్సీ సమావేశానికి సమగ్ర సమాచారంతో  రండి 

ఈ నెల 11న రెవెన్యూ భవనలో నిర్వహించనున్న డీఆర్సీ సమావేశానికి సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అజెండా ప్రకారం అన్ని రకాల అం శాలపై సమీక్ష ఉంటుందన్నారు. ఆ మేరకు ప్రతి శాఖ అధికారి వద్ద ఆ శాఖకు సంబంధించిన సమాచారం సమగ్రంగా ఉండాలన్నారు. ప్రధానంగా హెచ్చెల్సీ, తాగునీరు, ఉపాధిహామీ పనులు, నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు, సంక్షేమ పథకాలు, ఇసుక తదితర అంశాలపైనే సమావేశంలో చర్చ ఉంటుందన్నారు. ఆ యా శాఖల అధికారులు ఆ మేరకు సమాచారంతో వివరాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.


 నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల గ్రౌండింగ్‌ నెలాఖరులోపు 100 శాతం పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జేసీలు నిశాంతి, గంగాధర్‌ గౌడ్‌లతో కలిసి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్‌, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులతో ఖరీఫ్‌ సన్నద్ధత, జగనన్న పచ్చతోరణం, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌ మిల్క్‌కూలింగ్‌ యూనిట్లు తదితర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో 1.28 లక్షల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. నెలాఖరులోపు వాటి గ్రౌండింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబరు ఆఖరుకు బేస్మెంట్‌ స్థాయికి వచ్చేలా చూడాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేసి, ఇళ్ల గ్రౌండింగ్‌, నిర్మాణాలను పరిశీలించాలని తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్‌ ఏఈలను ఆదేశించారు. గ్రౌండింగ్‌కు అవసరమైన ఇసుక, సిమెంటు, స్టీల్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టాలను అందించాలన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో కేసులు పెగరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జి ల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో... ఇప్పటి వరకూ సా గు చేసిన పంటల వివరాలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 15లోపు 100 శాతం పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సలో సీపీఓ ప్రేమ్‌చంద్ర, జిల్లా పరిషత సీఈఓ భాస్కర్‌ రెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ చంద్రానాయక్‌, హార్టికల్చర్‌ డీడీ పద్మలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్‌, శ్రీనివాసులు, ఆనంద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-10T06:53:00+05:30 IST