ముగిసిన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-11-23T06:00:25+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ రెండు రోజుల పర్యటన సోమవారం ముగిసింది.

ముగిసిన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ పర్యటన
చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణను సన్మానిస్తున్న మాజీ మంత్రి పల్లె

పుట్టపర్తి, నవంబరు 22: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ రెండు రోజుల పర్యటన సోమవారం ముగిసింది. ఉదయం 9గంటల అల్పాహార అనంతరం సాయి కుల్వంత్‌ సభా మండపానికి వెళ్ళారు. అక్కడ సత్యసాయి మహాసమాధిని దర్శిం చుకున్నారు, 9-20కి విద్యార్థులు స్వాగతం పలుకగా పూర్ణచంద్రహాల్‌కు చేరుకున్నారు 9-24కు యూనివర్సిటీ స్నాతకోత ్సవం ప్రారంభం అయ్యింది. 9-45కు 17మంది విద్యా ర్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. 10గంటలకు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10-40కి శ్రీనివాస అతిఽథి గృహానికి చేరుకున్నారు. 11-30కి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు. అధికారులు వీడ్కోలు పలుకగా 11-45కు ప్రత్యేక విమా నంలో బయలుదేరి బెంగుళూరు వెళ్ళారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

న్యాయమూర్తికి ఘన సన్మానం

పుట్టపర్తిరూరల్‌: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణను పలువురు ఘనంగా సన్మానించారు. సోమవారం సాయి శ్రీనివాస్‌ అతిథి గృహంలో  పట్టు శాలువా క ప్పి సత్య సాయి చిత్ర పటాన్ని అందచేసి మాజీ మంత్రి పల్లె రఘునాఽథరెడి,్డ టీడీపీ నాయ కులు సన్మానించారు. అ దేవిధంగా లాయర్ల బృందం, పుట్టపర్తి ఆర్టీసీ కార్మికులు, ప్రముఖ చారిత్రక పరిశో ధకుడు మైనాస్వామి, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సన్మానించారు. 


Updated Date - 2021-11-23T06:00:25+05:30 IST