రికార్డు స్థాయిలో చికెన్‌ ధరలు

ABN , First Publish Date - 2021-07-12T05:56:52+05:30 IST

పట్టణంలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. మూడురోజుల క్రితం వరకు కిలో చికెన్‌ స్కిన్‌తో రూ.200, స్కిన్‌లె్‌సతో రూ.220 ధర ఉండేది

రికార్డు స్థాయిలో చికెన్‌ ధరలు
అమ్మకానికి సిద్ధంగా ఉన్న బ్రాయిలర్‌ కోళ్లు

స్కిన్‌ కిలో రూ.230

స్కిన్‌లెస్‌ కిలో రూ.260


తాడిపత్రి టౌన్‌, జూలై 11 : పట్టణంలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. మూడురోజుల క్రితం వరకు కిలో చికెన్‌ స్కిన్‌తో రూ.200, స్కిన్‌లె్‌సతో రూ.220 ధర ఉండేది. ప్రస్తుతం కిలో చికెన్‌ స్కిన్‌తో రూ.230, స్కిన్‌లె్‌స ధర రూ.260 వరకు ఉంటోంది. రికార్డు స్థాయిలోకి ధర చేరుకోవడంతో వ్యాపారుల ముఖాల్లో కళ వచ్చింది. ఈ ధ ర మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ధర పెరిగినా కొనుగోలు చే సేందుకు ప్రజలు వెనుకాడడం లేదు. వ్యాపారులు గతంలో కరోనాతో వ చ్చిన నష్టాలను పూడ్చుకొంటున్నారు. సరిగ్గా ఏడాదిక్రితం కరోనా ప్రభావంతో కిలో చికెన్‌ రూ.130వరకు పడిపోయింది. ఏడాది తిరగకుండానే చి కెన్‌ ధరలు రెండింతలు చేరుకున్నాయి. దీంతో అప్పట్లో నష్టపోయిన పౌల్ర్టీ పరిశ్రమతోపాటు చికెన్‌ వ్యాపారస్తులు లాభాల బాట పట్టారు. కరోనా బా రిన పడకుండా ఇమూ్యునిటీని పెంచుకొనేందుకు గుడ్లు, చికెన్‌, మటన్‌ లాంటి మాంసాహారం ప్రజలు తీసుకుంటున్నారు. ఇందులో మటన్‌ కిలో రూ.700 వరకు ఉంటుండడంతో చాలామంది చికెన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ధర పెరగడానికి ఇది ఒక కారణం కాగా, బ్రాయిలర్‌ కోళ్ల సరఫరా తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. మూడురోజుల్లో కే జీ మీద లైవ్‌ ధర రూ.45 వరకు పెరిగింది. దీంతో రిటైల్‌గా ధర పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు తెలిపారు. పట్టణానికి బ్రాయిలర్‌ కోళ్లు కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌, చెళ్లకెర, చిత్రదుర్గ, బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని మదనపల్లి, తెలంగాణాలోని హైదరాబాద్‌ నుంచి సరఫరా అవుతున్నాయి. పట్టణంలో ఆదివారం రోజు దాదాపు 25 టన్నుల మేర అమ్మకాలు జరుగుతాయి. మిగతా రోజుల్లో 5 టన్నుల మేర విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తంమీద వారంరోజుల్లో 50 నుంచి 60 టన్నుల మేర భారీగా చికెన్‌ వి క్రయాలు జరుగుతుండడం గమనార్హం.


సామాన్యులకు భారం 

పెరిగిన చికెన్‌ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగూ మటన్‌ ధరలు కిందకు రాకపోవడంతో కనీసం చికెన్‌ తిందామనుకున్న వారికి ధరలు చూసి భయపడుతున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో చికెన్‌ రూ.170 ఉండగా అమాంతం పెరిగిపోవడంతో చాలామంది పే ద, సామాన్య ప్రజలు కోడిగుడ్ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 


చికెన్‌ ధరలు ఆకాశాన్నంటాయి : మహేష్‌, యర్రగుంటపల్లి 

వారం రోజుల్లో చికెన్‌ ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ.260 వరకు ఉంటుండడంతో చికెన్‌ తినాలంటేనే భయంగా ఉంది. అరకొరగా వచ్చే కూ లీ డబ్బులు చికెన్‌కే సరిపోతాయి. గతంలో వారంలో ఒకరోజు చికెన్‌ తినేవాళ్లం. పెరిగిన ధరలతో నెలకు ఒకసారి తినాల్సి వస్తోంది. 


పెరిగిన ధరతో ఇబ్బందులు :  పుల్లయ్య, దినసరి కూలీ, తాడిపత్రి

చికెన్‌ ధర పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితేగాని డొక్కాడని తమలాంటి వారు మాంసాహారం మానేయాల్సిందే. కరోనా సమయం లో ఇమ్యూనిటీ పెంచుకొనేందుకు చికెన్‌ తరచుగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ధరలను చూస్తుంటే కొనేటట్లు లేదు. 


Updated Date - 2021-07-12T05:56:52+05:30 IST