చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-10-29T05:42:06+05:30 IST

సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెనుకొండ మండల న్యాయసేవా అధికారిక కమిటీ చైర్మన, జూనియర్‌ సివిల్‌జడ్జి రాధాకృష్ణమూర్తి తెలిపారు.

చట్టాలపై అవగాహన అవసరం

పెనుకొండ రూరల్‌, అక్టోబరు 28: సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని  పెనుకొండ మండల న్యాయసేవా అధికారిక కమిటీ చైర్మన, జూనియర్‌ సివిల్‌జడ్జి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని కోనాపురంలో న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు. సదస్సులో జడ్జి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అ వగాహన పెంపొందించుకుని చైతన్యవంతులు కావాలన్నారు. ఒకరిపట్ల ఒకరు ద్వేషం పెంచుకుని కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గమే రాజమార్గంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం స్థిరాస్థులు ఎలా పొందాలి..? తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ నాగరాజు, న్యాయవాదులు నాగరాజు, శ్రీరాములు, విశ్వనాథ్‌, ఎఎ్‌సఐ గిరి, హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-29T05:42:06+05:30 IST