చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

ABN , First Publish Date - 2021-10-29T05:50:53+05:30 IST

దశాబ్దాల రాజకీయ అనుభవమున్నప్పటికీ చంద్రబా బునాయుడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చే స్తున్నారని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన లక్ష్మీ పా ర్వతి మండిపడ్డారు.

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు


: రాష్ట్ర తెలుగు, సంస్కృత  అకాడమీ చైర్‌పర్సన లక్ష్మీపార్వతి

అనంతపురం, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి) : దశాబ్దాల రాజకీయ అనుభవమున్నప్పటికీ చంద్రబా బునాయుడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చే స్తున్నారని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన లక్ష్మీ పా ర్వతి మండిపడ్డారు. ఆమె గురువారం అనంతపురం ఎ స్కే యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసి న భాషాచైతన్య సదస్సుకు హాజరయ్యారు. ఈ సం దర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ... రా ష్ట్రంలో ఎలాంటి అలజడులు లేకున్నా... శాం తిభద్రత లకు విఘాతం కలగకున్నా... చంద్రబాబునాయుడు అలజడులు సృష్టించే విధంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.  

తెలుగు భాషను పరిరక్షించాలి

అనంతపురం అర్బన: బాల్యం నుంచే కమ్మనైన తెలుగు మాట్లాడేవిధంగా ప్రతిఒక్కరూ భాషను పరిరక్షించాలని తెలు గు, సంస్కృత అ కాడమీ చైర్‌పర్సన లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. గురువారం ఎస్కేయూలో  నిర్వహించిన భాషాచైతన్య సదస్సులో ఆమె మాట్లాడుతూ యునెస్కో నివేదిక మేరకు అంతరించిపోతున్న భాషల్లో తెలుగు ఉం డడం బాధాకరమన్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులోనే మాట్లాడేవిధంగా తల్లిదండ్రులు.. పిల్లలను ప్రోత్సహించాలన్నారు. అంతరించిపోతున్న తెలుగు భాషను కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, రెక్టార్‌ కృష్ణానాయక్‌, రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి, ఎస్కేయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, వక్తలు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, పతికి రమే్‌షనారాయణ, అంకే శ్రీనివాస్‌, ఆశావాది సుధామ వం శీ, పలువురు ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:50:53+05:30 IST