అధికారుల పనితీరును పర్యవేక్షించిన చైర్మన

ABN , First Publish Date - 2021-08-10T06:16:33+05:30 IST

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారుల పనితీరును టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు.

అధికారుల పనితీరును పర్యవేక్షించిన చైర్మన
స్పందన కార్యక్రమంపై సిబ్బంది పనితీరును ఆరాతీస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి టౌన, ఆగస్టు 9: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారుల పనితీరును టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ప్రజల సమస్యల పట్ల అధికారుల స్పందనపై ఆరాతీశారు. రికార్డుల నిర్వహణ అప్‌డేట్‌గా ఉంచాలన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం చైర్మ న పట్టణంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, పారిశుధ్యం తదితర సమస్యలపై ఆరాతీశారు. పలువురు కాలనీవాసులు అండర్‌డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతోపాటు పలుచోట్ల సిమెంట్‌రోడ్డు వేయాలని చైర్మనకు విన్నవించారు. సమస్యలుంటే ఎప్పటికప్పుడు అధికారులు, కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు చైర్మన సూచించారు. 

Updated Date - 2021-08-10T06:16:33+05:30 IST