మూడు రాజధానుల ఉపసంహరణపై సంబరాలు

ABN , First Publish Date - 2021-11-23T06:29:58+05:30 IST

మూడు రాజధానుల ఉపసంహరణపై టీడీపీ స్థానిక నా యకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో సో మవారం సంబరాలు చేసుకున్నారు.

మూడు రాజధానుల ఉపసంహరణపై సంబరాలు
గార్లదిన్నెలో సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు

గార్లదిన్నె,నవంబరు22: మూడు రాజధానుల ఉపసంహరణపై టీడీపీ స్థానిక నా యకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో సో మవారం సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా బాణాసంచా కా లుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీ మండల కన్వీనర్‌ జయరాం, మాజీ జడ్పీటీసీ గుర్రం ఆదినారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ ఆవుల క్రిష్ట, మాజీ ఎంపీటీసీ సుబ్బయ్య, నాయకులు వెంకటేష్‌, రామకృష్ణ, ఆవుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

అమరావతి రాజధాని రైతులకు అభినందనలు

శింగనమల, నవంబరు22 : రాజధాని అమరావతి రైతుల పోరాటానికి టీడీపీ అనంతపురం పార్లమెంటు అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, గోరంట్ల మారుతి నాయుడు, మాసూల చం ద్రమోహన, దండు విజయ్‌ సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాల సహకారం, రైతుల త్యాగాలకు ఫలితంగా.... ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దిగివచ్చి మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు హైకోర్టులో  తెలిపిందన్నారు.  ఇది వారు 706 రోజులుగా చేస్తున్న పోరాట ఫలితమేనన్నారు.


Updated Date - 2021-11-23T06:29:58+05:30 IST