రాజధానిని గల్లంతు చేశారు..

ABN , First Publish Date - 2021-12-25T06:03:13+05:30 IST

రాష్టానికి రాజధాని లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డిదే నని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు

రాజధానిని గల్లంతు చేశారు..

ఆ ఘనత సీఎం జగన్‌దే..

గౌరవసభలో మాజీ మంత్రి పల్లె

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 24: రాష్టానికి రాజధాని లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డిదే నని మాజీ  మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌లో గౌరవ సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థ, చేతకాని తనం వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. మూడు రాజధానుల అంటూ  ఉన్న ఒక్క రాజధాని లేకుండా చేశారన్నారు. అసెంబ్లీలో మహిళలను అగౌరపరిచిన వైసీపీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసి పోవడం ఖాయ మన్నారు. ద్రౌపదిని అవమానించిన దుర్యోదనుడికి ఏ గతి పట్టిందో గుర్తించాలన్నారు. 700 రోజులుగా రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేస్తున్న వారందరికి పాదా భివం దనం చేస్తున్నానన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరంలో ఒకొ క్కరిపై రూ. 2.50 లక్షలు అప్పు చేసి పెట్టిందన్నారు. మరో రెండేళ్ళలో రూ. 4 లక్షలు ఒకొక్కరిపై అప్పు పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవస రం లేదన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. నారా చంద్రబాబు నాయు డుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ శెట్టివారి జయ చంద్ర, మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌, హిందూపురం పార్లమెంట్‌ తెలుగుమహిళ కార్యదర్శి వైదేహీ, పుట్టపర్తి నియో జకవర్గ తెలు గుయువత అధ్యక్షులు బూదిలి ఓబుళరెడ్డి, మాజీ కన్వీనర్‌లు రాజారెడ్డి, రామానాయుడు, శంకర్‌నాయుడు, టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులునాయుడు, మాజీ కోఆప్షన్‌ సభ్యులు నిజాం, సర్పంచులు దారా లక్ష్మీదేవీ,  శంక ర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T06:03:13+05:30 IST