కొవ్వొత్తుల ప్రదర్శన

ABN , First Publish Date - 2021-01-20T06:16:04+05:30 IST

పట్టణంలోని గాంధీసర్కిల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆశా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

కొవ్వొత్తుల ప్రదర్శన
గుంతకల్లులో కొవ్వొత్తుల ప్రదర్శన

తాడిపత్రి, జనవరి 19: పట్టణంలోని గాంధీసర్కిల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆశా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కరోనాపై 50 రోజుల అవగాహన కార్యక్రమం  పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన చేపట్టారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్‌ ధరించి, నిబంధనలు పాటించాలని సూచించారు. 


పామిడి : రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం రాత్రి స్థానికంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమం లో ఏడీసీసీ బ్యాంకు చైర్మన వీరాంజినేయులు, తహసీల్దారు చిన్నన్న, మున్సిపల్‌ కమిషనర్‌ కే అనుపమ, వైద్యాధికారి రోహినాథ్‌ పాల్గొన్నారు.


కణేకల్లు: కరోనా నివారణపై అవగాహన కల్పిస్తూ స్థానిక చిన్నపరెడ్డి సర్కిల్‌ వద్ద అధికారులు మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ ఉషారాణి, ఎంపీడీవో విజయభాస్కర్‌తో పాటు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. 


రాయదుర్గం టౌన: మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ ఉద్యోగులు, ఏఎనఎంలు, వైద్యులు స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్‌ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన సీఐ ఈరణ్ణ పాల్గొన్నారు. 


పెద్దవడుగూరు: స్థానిక సచివాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు మంగళవారం తహసీల్దార్‌ లక్ష్మినాయక్‌, ఎంపీడీఓ కుళ్లాయిస్వామి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓఆర్‌డీ శివనాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి, సిబ్బంది జయరాముడు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 


యాడికి: యాడికి, రాయలచెరువు గ్రామాల్లో మంగళవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అలెగ్జాండర్‌, ఎంపీడీఓ కొండయ్య, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానికంగా కరోనాపై అవగాహన కల్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్వన నిర్వహించారు. మెప్మా, మున్సిపల్‌ , పొదుపు సంఘాల మహిళలతో మున్సిపల్‌ కార్యాలయం నుంచి వైఎ్‌సఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమం లో కమిషనర్‌ బండి శేషన్న, మెప్మా టీపీఆర్వో ఓ రామాంజినేయులు, సీఓలు సుశీల, మనోప్రియ, వనజ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ వ్యాక్సినేషన

కూడేరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియ కొనసాగింది. మండలంలోని ఏఎనఎంలు, అంగనవాడీ వర్కర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది 100 మంది టీకా కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిరోజు 69 మంది వ్యాక్సిన వేయించుకున్నట్లు డాక్టర్‌ సరిత తెలిపారు.Updated Date - 2021-01-20T06:16:04+05:30 IST