అభ్యర్థుల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయండి

ABN , First Publish Date - 2021-02-06T07:08:25+05:30 IST

గ్రామ పంచా యతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రామకృష్ణ అధికారులకు సూచించారు.

అభ్యర్థుల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయండి


- ఎన్నికల పరిశీలకుడు రామకృష్ణ

అనంతపురం విద్య, ఫిబ్రవరి 5 : గ్రామ పంచా యతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రామకృష్ణ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన జడ్పీలోని సమావేశ మందిరంలో ఆడిట్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన దానికంటే అభ్యర్థులు అధికంగా ఎన్నికల్లో ఖ ర్చు చేయకుండా చూడాలన్నారు. సర్పంచుఅభ్యర్థి 10 వేల ఓటర్లుపైగా ఉండే పంచాయతీలో రూ. 2.50 ల క్షలు, వార్డు సభ్యులు రూ. 50 వేలు 10 వేల కంటే తక్కువ ఓటర్లు ఉండే పంచాయతీలో సర్పంచుఅభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30 వేలు లోపు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల్లో బ్యానర్లు, పో స్టర్లు, వాహనాలు, సమావేశాల నిర్వహణ తదితర అన్ని రకాల ఖర్చులను నమోదుచేయాలని సూచించా రు. నోడల్‌ ఆఫీసర్లు వెంకట్రాముడు, లైజన్‌ ఆఫీసర్‌ వెంకటశివారెడ్డి, ఆడిట్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T07:08:25+05:30 IST